Jagan: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత చాలా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. విద్యకు సంబంధించిన పథకాలనుఁ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. నాడు నేడు ప్రోగ్రామ్ తో విద్యావ్యవస్థను అభివృద్ధి చెయ్యడానికి వైసీపీ ప్రభుత్వం చాల ప్రయత్నిస్తుంది. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చెయ్యడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నప్రయత్నాల గురించి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చెప్పినవి వింటే ఎవ్వరికైనా ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి విద్యాసంస్థల గురించి, విద్యార్థుల గురించి ఇన్ని చేశాడా అన్న అనుమానం కలుగుతుంది. ఏ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల గురించి, పట్టించుకోలేదని జగన్ మాత్రమే వాళ్ళ గురించి పట్టించుకున్నారని, వాటి బాగు కోసం కృషి చేసిన ఘనత కూడా జగన్ కు మాత్రమే దక్కుతుందని వంశీ తెలిపారు.
జగన్ ఇన్ని చేశాడా!!
బాపులపాడు మండలం వీరవల్లిలోని జెడ్పీ హైస్కూల్‌లో తానా కమ్యూనిటి సర్వీసెస్ కోఆర్డినేటర్ కసుకుర్తి రాజా సొంత నిధులతో నిర్మించిన సైకిల్ షెడ్‌ను ప్రారంభారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. తాను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నానని బాల్యాన్ని గుర్తు చేసుకున్నారు. తాను చదువుకునే సమయంలో ఇప్పుడు ఉన్నన్ని సౌకర్యాలు ఉండేవి కావని చెప్పారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యాసంస్థల గురించి చాలా చేశాడని, విద్య మాత్రమే సమాజంలో ఉన్న అసమానతలను తొలగిస్తుందని, కులం, మతం అనే అంశాలను పట్టించుకోకుండా అందరికి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని వంశీ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టిన ఘనత వైసీపీకి దక్కుతుందని వంశీ వెల్లడించారు. అలాగే ప్రభుత్వ విద్యార్థులు ఎలాంటి యూనిఫామ్ వేసుకోవాలి, ఎలాంటి షూ వేసుకోవాలనే అన్ని విషయాలను జగన్ దగ్గరుండి చూసుకున్నారని వంశీ వెల్లడించారు.
ఇవన్నీ అమలు అవుతున్నాయా!!
అలాగే స్కూల్ విద్యార్థులకు పాఠశాలల్లో పిల్లలకు మధ్యాహ్నం ఎలాంటి భోజనం పెట్టాలో కూడా మెనూను సి ఎం జగన్మోహన్ రెడ్డినే నిర్ణయించారని, రాష్ట్రంలో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులందరికీ ట్యాబ్స్ ఇచ్చిన ఘనత వైసీపీకి మాత్రమే దక్కుతుందని వంశీ వెల్లడించారు. వంశీ ఇవన్నీ చెప్తున్నారు కానీ ఇవన్నీ పకడ్భందిగా అమలు చేస్తున్నారా అనేది ప్రశ్న. తెలంగాణలో విద్య గురించి తాము చాలా చేస్తున్నామని కేసీఆర్ ఎప్పుడు చెప్తూ ఉంటారు కానీ రోజుకో స్కూల్ ల్లో విద్యార్థులు అక్కడి భోజనం తింటూ అనారోగ్యం పాలవుతున్నారు. జగన్ ప్రభుత్వం కూడా ఇలానే నామమాత్రంగా అమలు చేస్తుందా లేదా నిజంగానే అమలు చేస్తుందా అనే ప్రశ్న ప్రజల్లో వస్తుంది.