YS JAGAN MOHAN REDDY: 2024 ఎలక్టన్స్ కోసం వైసీపీ వేస్తున్న కొత్త వ్యూహాలు తెలుసా

Arjun

YS JAGAN MOHAN REDDY: 2024 ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటికి నుండే అన్ని పార్టీల నాయకులూ విస్తృతంగా ప్రణాళికలు రచిస్తున్నారు. వైసీపీని ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ నాయకులూ ప్రయత్నిస్తుంటే, ఎలాగైనా మళ్ళీ తామే అధికారంలోకి రావాలని వైసీపీ నాయకులూ వ్యూహాలు రచిస్తున్నారు.

what are the ysrcp plan for 2024 elections

ఈ వ్యూహాల రచనలో భాగంగా వైసీపీ రానున్న ఎన్నికల కోసం కొత్త ప్రణాలికను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.

వ్యతిరేకిస్తే టికెట్ రాదు

వైసీపీలో ఉన్న ప్రతి ఒక్కరు పార్టీ నియమ నిబంధనలకు లోబడి పని చెయ్యాలని, ఎలాంటి ఎవరైనా పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తగా జరిగిన సమావేశంలో జగన్ వెల్లడించారు. మంత్రులు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ కో ఆర్డినేటర్స్ మధ్య ఏర్పడిన వివాదాలను దృష్టిలో పెట్టుకొని జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వ్యక్తిగత గొడవలను పక్కన పెట్టి పార్టీ కోసం పని చెయ్యాలని, పార్టీ బాగుంటేనే మనం కూడా బాగుంటామని తెలిపారు.

ప్రజల వద్దకు ప్రతినిధులు

2024 ఎన్నికల్లో గెలవడానికి ఇప్పటి నుండే జగన్ తన వ్యూహాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి జిల్లా కు తాను వస్తానని జగన్ వెల్లడించారు. గ్రామా స్థాయిలో కూడా సోషల్ విస్తృతంగా వాడుకోవాలని, ప్రజలకు మనం చేసిన మంచి చెప్పాలని ఆదేశాలు జారీ చేశారు. మూడేళ్ళలో 90 % హామీలను ప్రభుత్వం నెరవేర్చిందన్న విషయాన్నీ గడప, గడపకు వెళ్లి ప్రజలకు చెప్పి, వైసీపీ బలాన్ని పెంచాలని తెలిపారు. గడప, గడపకు వైసీపీ పూర్తి సమావేశం జూన్ 8న ఉంటుందని జగన్ తెలిపారు .

- Advertisement -