Jagan: వైసీపీకి ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ప్రతిపక్షాలు అన్నీ కలిసి వైసీపీని ఓడించడానికి ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ వ్యూహాలు చూసి వైసీపీకి ఇప్పటికే భయం మొదలైంది. ఆ వ్యూహాలను తిప్పికొట్టే ప్రయత్నాలు కూడా వైసీపీ మొదలు పెట్టింది. అయితే ఇప్పుడు వైసీపీకి మూడు రాజధానుల రూపంలో మరో భయం పట్టుకుంది. వైసీపీ ఈ మూడు రాజధానుల అంశాన్ని ఎప్పుడైతే తెరపైకి తెచ్చిందో అప్పటి నుండే ఈ విషయంపై వైసీపీ ప్రజల నుండి వ్యతిరేకత వస్తూనే ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, అమరావతి రైతులు హై కోర్ట్ ను ఆశ్రయించగా, కోర్ట్ అమరావతినే రాజధానిగా ఉంచాలని తీర్పు ఇచ్చింది . ఆ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ ప్రభుత్వం హై సుప్రీం కోర్ట్ కు వెళ్ళింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఇచ్చే తీర్పు చుట్టూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ముడిపడి ఉన్నాయ్.

కోర్ట్ తీర్పు ఎలా ఉండబోతుంది!!
మూడు రాజధానుల అంశాన్ని ఎవ్వరూ అంత ఈజీగా వదిలిపెట్టడం లేదు. మూడు రాజధానులు కావాలని వైసీపీ, అమరావతే రాజధానిగా ఉండాలని ప్రతిపక్షాల నాయకులు పట్టుపట్టుకు కూర్చున్నారు. అయితే ఇప్పుడు ఈ విషయం సుప్రీం కోర్ట్ చేతుల్లో ఉంది. అది తీర్పును బట్టి తమ వ్యూహాలను రచించడానికి లేదా మార్చడానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధమయ్యారు. ఈ తీర్పు ఒకవేళ మూడు రాజధానులు వ్యతిరేకంగా ఉంటె మాత్రం వైసీపీ వచ్చే ఎన్నికల్లో ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే ఇప్పుడే వైసీపీ చేస్తున్న పాలనపై ప్రజల్లో చాలా అసంతృప్తి ఉంది. వైసీపీ ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోవడం లేదని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. పైగా ఈ విషయాన్ని ప్రతిపక్షాల నాయకులు కూడా ఎన్నికల ప్రచారానికి వాడుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నోసార్లు వైసీపీ ప్రభుత్వం కోర్టుల నుండి తిట్లు తింటూ, ప్రవేశపెట్టిన బిల్లులను వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఈ మూడు రాజధానుల విషయంలో కూడా ఎదురుదెబ్బ తగిలితే మళ్ళీ వైసీపీ అధికారంలోకి రావడం కష్టమే.
వైసీపీ వ్యూహమేనా ఇదంత!!
ఇప్పుడు ఒకవేళ హై కోర్ట్ లో తలిగినట్టే, సుప్రీం కోర్ట్ లో కూడా వైసీపీకి ఎదురుదెబ్బ తగిలితే, దాన్ని ఎలా రాజకీయం చెయ్యాలో కూడా వైసీపీ వ్యూహం రచించిందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. మొన్నటి వరకు వైజాగ్ ను రాజధాని చేస్తే చాలని అన్న నాయకులు ఇప్పుడు మరో వాదంతో ముందుకు వస్తున్నారు. ఒకవేళ వైజాగ్ ను రాజధానిగా చేయకుంటే, తమకు ప్రత్యేక ఉత్తరాంధ్ర రాష్ట్రం ఇవ్వాలని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేస్తున్నారు. అలాగే రాయలసీమను కూడా ప్రత్యేక రాష్ట్రంగా చెయ్యాలని బైరెడ్డి డిమాండ్ చేస్తున్నారు. అంటే ఎక్కడికి అక్కడ ప్రాంతీయ భావాలను రెచ్చగొట్టి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవడానికి వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఈ మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొని రాకుండా ఉంటే, ఇప్పుడు అమరావతిని ఎందుకు డెవలప్ చెయ్యలేదని ప్రజలు అడిగేవాళ్లు . అలా జనం అడగకుండా ఉండేందుకే వైఎస్ జగన్ జగన్ మోహన్ రెడ్డి ఈ మూడు రాజధానుల వ్యూహాన్ని తెరపైకి తెచ్చి, ఇష్టమొచ్చినట్టు నాటకాలు ఆడుతున్నారు.