Ys Jagan Mohan Reddy: వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క పథకాన్ని కేసుల పూర్తిగా అమలు చేసినా దాఖలాలు లేవు. ప్రతి పథకం యొక్క అమలులో ఎదో ఒక తిరకాసు ఉంటేనే ఉంది . అలాగే ఇప్పుడు అమ్మఒడి పథకాన్ని అమలు చేయడంలోనూ వైసీపీ అదే ధోరణిని పాటిస్తుంది. ఇప్పటికే రావలసిన అమ్మ వోడి డబ్బులు ఇంకా విద్యార్థుల ఖాతాల్లో జామ కాలేదు. జనవరిలో రావాలి కానీ వైసీపీ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఇంకా ఖాతాల్లో జమ చెయ్యలేకపోయింది. అయితే ఇప్పుడు ఈ పథకం నుండి లబ్దిదారులను తగ్గించడానికి విచిత్రమైన కండిషన్స్ పెడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో గెలవడానికి ఇష్టమొచ్చిన హామీలు ఇస్తే తరువాత అమలు చెయ్యడానికి ఎంత కష్టమవుతుందో వైసీపీ ప్రభుత్వాన్నిచూస్తే అర్ధమవుతుంది.

ఇదే కాదు ఇలాంటి ఎన్నో పథకాలను వైసీపీ ప్రారంభించి వాటిని కంటిన్యూ చెయ్యలేక నానా ఇబ్బందులు పడుతుంది.
జూన్ లో ఇస్తాం
జనవరిలో రావాల్సిన డబ్బులు ఇంకా ఇవ్వకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తోంది. మొన్నటి వరకు ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల ఈ పథకాన్ని అమలు చెయ్యడం ఆపిందనుకుంటే, ఇప్పుడు మద్యం బాండ్స్ తాకట్టు పెట్టి అప్పు తెచ్చింది ఇప్పుడు ఆ డబ్బును పెట్టి ఈ పథకాన్ని అమలు చెయ్యొచ్చు కదాని రాష్ట్ర ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జూన్ ఇరవయ్యో తేదీ దాటిపోయింది. ఇరవై ఒకటోతేదీన అమ్మఒడి జమ చేస్తామన్నారు. కానీ ఆ తేదీ వచ్చినా ప్రభుత్వం కిక్కురుమనలేదు. ఇప్పుడు వచ్చే వారం ఇస్తామని చెబుతున్నారు. కానీ ఇస్తారో లేదో స్పష్టత లేదు.
ఇష్టమొచ్చిన నిబంధనలు
వైసీపీ ప్రారంభించిన ఏ పథకం యొక్క నింబధనలు ఎప్పుడు కూడా ఒకేలా ఉండవు. అవి ఇష్టమొచ్చిన సందర్భంలో ఇష్టమొచ్చినట్టు మారుతూ ఉంటాయి. ఇప్పుడు అమ్మఒడి పథకానికి కూడా నిబంధనలు ఇప్పుడు మార్చినట్టు తెలుస్తుంది . విద్యార్థుల అటెండెన్స్ సహా ఈ సారి అనేక నిబంధనలు పెట్టారు. ఈ కారణంగా లక్షల్లో లబ్దిదారులు తగ్గిపోయారన్న ప్రచారం జరుగుతోంది. కొత్త నిబంధనలు పెట్టేది పథకం సరైన లబ్ధిదారులకు చేరడానికి కాదు ఉన్న లబ్ధిదారులను తగ్గించడానికి. ఇలా పనికిమాలిన నిబంధనలు పెట్టి చాలా పథకాల్లో లబ్ధిదారులను తగ్గించేశారు ఇప్పుడు ఈ పథకంలో కూడా ఇలానే చేస్తుంది.