KCR: ఖమ్మంలో 18న కేసీఆర్ భారీ బహిరంగ సభను పెట్టనుంనున్న విషయం తెలిసిందే. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన తరువాత కేసీఆర్ పెట్టనున్న భారీ సభ ఇదే కావడం కావడంతో జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు ఈ సభ తెలంగాణ, జాతీయ స్థాయి రాజకీయాల్లో అనుసరిస్తున్న బీఆర్ఎస్ పార్టీ అనుసరించనున్న విధివిధానాలను పేర్కొననున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ వ్యూహాలను ఇక్కడ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈసభకు వచ్చే జాతీయ నాయకుల గురించి కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఇక్కడికి వచ్చే నాయకులే వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ కు మద్దతుగా నిలిచే వాళ్ళో లేదా కేసీఆర్ ఏర్పాటు చేయనున్న కూటమిలో పాలుపంచుకోనున్న నాయకులుగా ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.
ఎవరెవరు వస్తున్నారో తెలుసా!!
ఇప్పుడు ఖమ్మంకు సభకు వచ్చే నాయకలే కేసీఆర్ కు జాతీయ ఎన్నికల్లో తోడుగా ఉంటారని, భవిష్యత్ లో తనకు కలిసి వచ్చే వాళ్లనే కేసీఆర్ ఇక్కడికి అతిథులుగా పిలిచాడు. ఖమ్మం సభకు ఇద్దరు ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. కేరళ, పంజాబ్ ముఖ్యమంత్రులు పినరయి విజయన్, భగవంత్ మాన్ హాజరు కావడం ఖాయమైంది. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్.. ఇందులో పాల్గొననున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్ డీ కుమార స్వామి సైతం ఈ సభకు వస్తారనే అంచనాలు ఉన్నాయి. ఇక్కడికి వచ్చే నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బీజేపీని ఓడించాలని కంకణం కట్టుకున్నవాళ్ళే. బీజేపీ వ్యతిరేకులుగా ఉన్న వారందరూ ఈసభకు వచ్చే అవకాశం ఉంది.
బీజేపీకి వార్నింగ్ ఇవ్వనున్నారా!!
ఈసభకు దాదాపు 10లక్షల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉందని మీడియా వర్గాలు చెప్తున్నాయి. ఈసభతో తన జాతీయ రాజకీయాలకు పునాది వెయ్యడానికి కేసీఆర్ కంకణం కట్టుకున్నారు. అందుకే ఈసభను ఎట్టి పరిస్థితుల్లో విజయవంతం చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చెయ్యాలని కేసీఆర్ పార్టీ వర్గాలకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే ఖమ్మంలో ఉన్న కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ఈసభకు అక్కడ బీజేపీలోకి వెళ్ళాలన్న వాళ్ళను కూడా మళ్ళీ తన దగ్గరికి తీసుకోవడానికి ఈసభ ఉపయోగపడనుంది. అలాగే ఇక్కడికి వచ్చిన జాతీయ నేతల సమక్షంలోనే బీజేపీని ఎదుర్కొనడానికి వ్యూహాన్ని ప్రకటించనున్నారని సమాచారం.