Telangana Richest And Poorest MLAs : ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. తెలంగాణలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వస్తుందా? లేక ఈసారి కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తుందా? లేక బీజేపీకి తెలంగాణ ప్రజలు ఒక్క చాన్స్ ఇస్తారా అనేది తెలియదు. అసలు ఏ పార్టీ గెలుస్తుంది అనేది పక్కన పెడితే తెలంగాణ రాజకీయాలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఎన్నికల ప్రచారాన్ని ప్రధాన పార్టీలన్నీ ముమ్మరం చేశాయి. రోజురోజుకూ ప్రధాన పార్టీ మధ్య పోటీ పెరుగుతోంది. మేనిఫెస్టోలు కూడా పోటాపోటీగా ప్రకటిస్తున్నారు. ఈనేపథ్యంలో అసలు తెలంగాణలో ప్రస్తుతం ఉన్న 119 ఎమ్మెల్యేలలో ఎవరు ధనిక ఎమ్మెల్యేలు, ఎవరు పేద ఎమ్మెల్యేలు అనేది తెలుసుకుందాం రండి.
తాజాగా అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ అనే సంస్థ తెలంగాణలో ఉన్న 119 ఎమ్మెల్యేలలో ఎవరు అత్యంత ధనికులు ఉన్నారు.. ఎవరు అత్యంత పేద ఎమ్మెల్యేలుగా ఉన్నారో ఒక రిపోర్ట్ ను తయారు చేసింది. అందులో నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి టాప్ లో నిలిచారు. ఇక.. అత్యంత పేద ఎమ్మెల్యేల లిస్టులో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో మజ్లీస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే కాగా, మరొకరు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. మజ్లీస్(ఎంఐఎం) పార్టీకి చెందిన అహ్మద్ పాషా అనే ఎమ్మెల్యేకు కేవలం 19 లక్షల ఆస్తి మాత్రమే ఉంది. మర్రి జనార్ధన్ రెడ్డికి ఉన్న ఆస్తులు 161 కోట్లు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న ఎమ్మెల్యే పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి. ఆయన ఆస్తి 91 కోట్లు. మూడో ప్లేస్ లో భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి ఉన్నారు. ఆయన ఆస్తి కూడా 91 కోట్లు.
Telangana Richest And Poorest MLAs : చొప్పదండి ఎమ్మెల్యే కూడా అత్యంత పేద ఎమ్మెల్యే
ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అహ్మద్ పాషా, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కూడా పేద ఎమ్మెల్యేల జాబితాలో ఉన్నారు. అహ్మద్ పాషా ఆస్తి 19 లక్షలు కాగా, చొప్పదండి ఎమ్మెల్యే ఆస్తి 20 లక్షలు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆస్తి 27 లక్షలుగా తేలింది.
గత ఎన్నికల్లో అంటే 2018 ఎన్నికల్లో నామినేషన్ సమయంలో వీళ్లు సమర్పించిన ఆఫిడవిట్ ఆధారంగా సేకరించిన రిపోర్ట్ ఇది. 5 ఏళ్ల సమయం గడిచిపోవడంతో.. ఇప్పుడు ఆ లెక్క అటూ ఇటూ తారుమారు అయ్యే అవకాశం కూడా ఉంది.