Jagan:వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఎంతో నమ్మకంతో ఏపీ ప్రజలు అధికారాన్ని ఇచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఆ నమ్మకాన్ని ఎప్పుడో పాతిపెట్టారు. తనకు ఇష్టమొచ్చినట్టు పాలన కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారు. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు బాబు తన రాజకీయ లబ్ధికోసం ప్రజలను మోసం చేసి, బీజేపీకి తొత్తుగా మారారు. అలాగే ఇప్పుడు జగన్ కూడా బీజేపీకి తొత్తుగా ఉంటూ, బీజేపీ చెప్పినట్టు వింటూ, బీజేపీ మెడలు వంచి ప్రత్యేకహోదా తెస్తానని చెప్పిన జగన్ ఇప్పుడు బీజేపీకి తొత్తులా పని చేస్తున్నారు. ఇప్పటికే విద్యలో రాష్ట్రం ఎంత వెనకపడిందో మొన్న వచ్చిన ఇంటర్, టెన్త్ రిజల్ట్స్ లో బయటపడింది. ఇలా అనేక సంస్థలనుజగన్ నాశనం చేశారు. బాబు కొంత నాశనం చేసి వదిలిపెడితే దాన్ని ఇప్పుడు జగన్ సంపూర్ణంగా నాశనం చేస్తున్నారు. ఇప్పుడు వైసీపీ పాలన ఎలా ఉందంటే ప్రభుత్వాన్ని కనీసం వైసీపీ నాయకులు కూడా నమ్మడం లేదు. జగన్ వల్ల ప్రభుత్వ ఆస్తులను కొనడానికి కూడా జనాలు రావడం లేదు. జగన్ అన్న పేరు వింటేనే జనమ పారిపోతున్నారు.
జగన్ పై నమ్మకం లేదా!!
జగన్ పై ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారని చెప్పడానికే చాల సందర్భాలు ఉన్నాయ్. అయితే ఇప్పుడు వైజాగ్ గురించి మాట్లాడుకుందాం. విశాఖలో దాదాపుగా రెండు వేల ప్లాటను ప్రభుత్వం జగనన్న లే ఔట్లలో వేలానికి పెట్టింది. భారీగా ప్రచారం చేసి వేలం నిర్వహించారు. ఇంత హడావుడి చేస్తే, రెండు వేల ప్లాట్లకు కనీసం రెండు వందల మంది కూడా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేయలేదు. చివరికి తొలి విడతగా కట్టాల్సిన సొమ్మును కట్టిన వారు కేవలం 70 మంది మాత్రమే. వీరు కూడా మిగతా సొమ్ము కడతారా, పోయింది చాల్లే అనుకుంటారా అన్నది తర్వాత తేలుతుంది. కానీ ప్రభుత్వం ఆర్భాటం చేస్తున్న స్థలాల విషయాన్ని అసలు ప్రజలు పట్టించుకకోపవడమే ఇక్కడ ఆశ్చర్యం. ఇలా జగన్ పై ప్రజలకు పూర్తిగా జగన్ ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారు. అయినా కూడా జగన్ ప్రవర్తన మారేలా లేదు ఎందుకంటే ప్రజలకు ఎన్నికల సమయంలో డబ్బులిస్తే ఇవన్నీ మర్చిపోయి మళ్ళీ తననే గెలిపిస్తారని నమ్మకంతో ఉన్నారు.
ప్రభుత్వానికి ఇది అవమానమా!!
ఒక ప్రభుత్వం పెట్టిన వేలానికి ఇంత తక్కువ స్పందన రావడం అనేది ప్రభుత్వానికి అవమానమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే ఎందుకంటే వైజాగ్ లాంటి ప్రాంతాల్లో ఇంత తక్కువ స్పందన రావడమనేది చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది.వైజాగ్ ను రాజధాని చేస్తానని చెప్పిన తరువాత కూడా ఇలా ప్రజలు ఆసక్తి చూపించకపోవడం కేవలం జగన్ పై నమ్మకం లేకపోవడం వల్లేనని నిపుణులు చెప్తున్నారు. అయినా ఇంత అవమానం జరిగినా కూడా జగన్ తన చీప్ పాలనా విధానాన్ని మాత్రం మార్చుకోరు. రానున్న రోజుల్లో ప్రజలు జగన్ కు ఎలా బుద్ది చెప్తారో వేచి చూడాలి.