BJP: ఏపీలో బీజేపీ ఉందన్న విషయం కూడా చాలామంది ప్రజలకు తెలియదు. ఎందుకంటే అక్కడ ఉన్న బీజేపీలో ఒక్క నేత కూడా ప్రజలకు తెలియదు. పోనీ ఆ పార్టీ నేతలు ప్రజల సమస్యలపై ఏమన్నా పోరాటం చేస్తున్నారా అంటే అది కూడా లేదు. కాబట్టి అసలు ఆ పార్టీ ఉందన్న విషయాన్నీ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. జనసేనతో పొత్తు ఉండటం వల్ల ఆ పార్టీ పేరు అప్పుడప్పుడు వినిపిస్తుంది కానీ లేకపోతే అసలు బీజేపీని పట్టించుకునే వారే లేరు. జనసేన అండతో బతుకుతున్న బీజేపీ నాయకులు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మాతో పొత్తులో ఉంటూ, మాకే నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. ఈరోజు పార్టీ కార్యవర్గ సమావేశంలో జీవీఎల్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీశాయి.
జనసేనతో పొత్తు ఉందా!!
2019 ఎన్నికల తరువాత జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయ్. రెండు మొదట్లో కార్యక్రమాలు కలిసి చేసేవారు కానీ తరువాత పూర్తిగా రెండు పార్టీలు ఎవరి కార్యక్రమాలు వాళ్ళు నిర్వహించుకుంటున్నారు. అయితే ఎన్నికలు దగ్గరికి వస్తున్న నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి జనసేన విపరీతమైన ఆసక్తి చూపిస్తుంది. కానీ టీపీడీతో పొత్తు పెట్టుకోవడం బీజేపీ ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు బీజేపీ, జనసేన మధ్య ఇంకా పొత్తులో ఉన్నాయా అనే డౌట్ కూడా వస్తుంది. అయితే తాము ఇంకా పొట్టులోనే ఉన్నామని నిన్న పవన్ కళ్యాణ్ ప్రకటించారు, అలాగే ఇవ్వాళా బీజేపీ పెద్దలు కూడా ఏపీలో జనసేనతో పొత్తులో ఉన్నట్టు ప్రకటించింది. అయితే రానున్న రోజుల్లో బీజేపీ కూడా జనసేన -టీడీపీతో కలిసి ఎన్నికలకు వెళ్తాయేమో చూడాలి. వైసీపీని ఓడించడం కోసమే, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ఇష్టం లేదు పొత్తులకు తాము సిద్ధంగా ఉన్నామని పవన్ తెలిపారు. ఒకవేళ బీజేపీ కూడా వైసీపీని ఓడించాలని అనుకుంటే, ఈ రెండు పార్టీలతో కలిసే అవకాశం ఉంది.
టీడీపీతో బీజేపీకి గొడవేంటి!!
గతంలో బీజేపీ టీడీపీతో పొత్తుకుంది కానీ ఇప్పుడు టీడీపీతో కలవడానికి మాత్రం అసలు ఇష్టపడటం లేదు. దీనికి కారణం మాత్రం టీడీపీ ఓటమే అని తెలుస్తుంది. జగన్ కూడా ఇప్పుడు కేంద్రంలో బీజేపీకే సపోర్ట్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగో జగన్ మోహన్ రెడ్డి గెలుస్తానే నమ్మకంతోనే టీపీడీతో పొత్తుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు దేశంలో బీజేపీపై వ్యతిరేకత పెరుగుతూ ఉంది. కాబట్టి కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రావాలంటే గెలిచే పార్టీలతో మంచిగా ఉండటం మంచిదని భావించే, ఏపీలో వైసీపీకి పోటీగా ఉండటానికి బీజేపీ నేతలు ఇష్టపడటం లేదు. బీజేపీ ఇలాంటి అవకాశవాద పాలిటిక్స్ మొదటి నుండి చేస్తుంది. కాబట్టి ఇప్పట్లో టీడీపీతో కలవడానికి బీజేపీ సిద్ధపడేట్టు మాత్రం కనిపించడం లేదు.