Raghunandan Rao: తెలంగాణాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు బీజేపీ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే అయిన రఘునందన్ రావు. హైదరాబాద్ లో జరిగిన మైనర్ బాలిక రేప్ విషయంలో పెద్ద ఎత్తున పోరాడుతున్నారు. నేరంచేసిన వారిని అధికార పార్టీ నాయకులు తప్పిస్తున్నారని, అయన తీవ్రమైన వ్యాఖ్యలు ప్రభుత్వంపై చేస్తూ, అలాగే ఆ ఘటనకు సంబంధించిన వీడియోస్ ను , ఫొటోస్ ను మీడియాకు విడుదల చేశారు. ఈ విషయమై ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మైనర్ వీడియో, ఫొటోస్ విడుదల చెయ్యడం వల్ల పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. అయితే ఇక్కడ తెలంగాణ రాజకీయ వర్గాలకు అర్ధం కానీ విషయం ఏంటంటే ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా రఘునందన్ కు మద్దతు తెలుపుతూ లేదా ఆయన పక్షాన నిలబడి ప్రభుత్వంపై పోరాడటం లేదు. ప్రభుత్వం మీద అస్తమానం విరుచుకుపడే నాయకులు కూడా ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు.
ఎందుకు మద్దతు లేదు??
టిఆర్ఎస్ ను విమర్శించడానికి వచ్చిన ఏ అవకాశాన్ని ఒదులుకోని బీజేపీ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుందని తమ పార్టీ నాయకుడే చెప్తున్నప్పటికీ ఎందుకు మద్దతు ఇవ్వడం లేదో అర్ధం కావడం లేదు. కాంగ్రెస్ నాయకులు కూడా రఘునందన్ ను విమర్శిస్తున్నారు. అయితే బీజేపీ నాయకులు కనీసం మద్దతు ప్రకటించడం లేదు. పైగా ఆయనకు అరెస్ట్ చేస్తుంటే కూడా బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు. అయితే ఇదంతా రఘునందన్ పార్టీ పెద్దలకు చెప్పకుండా తానె చేశాడు కాబట్టి అందుకే పార్టీ పట్టించుకోవడం లేదని, అయినా రేప్ విషయం కాబట్టి ఏదైనా తేడా జరిగితే మొత్తం పార్టీకే చెడ్డ పేరు వస్తుందన్న బీజేపీ నాయకులు సైలెంట్ గా ఉన్నారు.
తానొక్కడే తన మద్దతు
తానూ ఎలాంటి సమాచారం బయటపెట్టలేదని, తనకు 30 ఏళ్లగా లాయర్ గా పని చేసిన అనుభవం ఉందని, తనకు ఎవ్వరు చట్టం గురించి చెప్పాల్సిన అవసరం లేదని రఘునందన్ చెప్పారు. రఘునందన్ విడుదల చేసిన వీడియోలతోనే పోలీసులు ఎమ్మెల్యే కొడుకు కూడా రేప్ ఘటనలో ఉన్నాడని కేసు నమోదు చేయాల్సి వచ్చింది. రఘునందన్ ఒక్క్కడే అన్ని మీడియా చానెల్స్ చుట్టూ తిరుగుతూ తన కోసం తానూ పోరాడుకుంటున్నారు. బీజేపీ మద్దతు ఇవ్వకపోవడాన్ని రఘునందన్ ఎలా తీసుకుంటారో వేచి చూడాలి. బీజేపీ నాయకులు రఘునందన్ కు మద్దతు ఇవ్వలేదు కాబట్టి పరోక్షంగా రఘు చేస్తున్నది తప్పని బీజేపీ నాయకులే చెప్తున్నారని తెరాసా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.