TELANGANA:తెలంగాణపై బీజేపీకి ఇంత కోపమా!

Arjun

TELANGANA:తెలంగాణాలో బీజేపీ-టిఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు చాలా గట్టిగా సాగుతుంది. ఈ పోరు వల్ల కేసీఆర్ ప్రభుత్వానికి కేంద్రం నుండి అస్సలు ఎలాంటి సహకారం లభించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న పోరులో బీజేపీ తన అధికారాన్ని దుర్వినియోగ పరుస్తూ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది.

WHY BJP SHOWING SO MUCH PARTIALIITY ON TELANGANA STATE

కేవలం రాజకీయ ప్రయోజనం కోసం ఇలా ప్రజలకు మేలు జరిగే పనులకు కూడా అడ్డుపడుతూ ఉంది. రాష్ట్రానికి అప్పు ఇచ్చే అధికారాన్ని తన ఆధీనంలో పెట్టుకున్న బీజేపీ, రాష్ట్రానికి కొత్త అప్పులు రాకుండా చేస్తుంది.

రాష్ట్రానికి బీజేపీ అడ్డం

తెలంగాణ అప్పుల విషయంలో ఎలాంటి బ్యాడ్ రికార్డు లేదు. అయినా కూడా రాష్ట్రానికి కొత్త అప్పులు రాకుండా అడ్డుగా బీజేపీ నిలబడుతుంది. కానీ ఏపీకి మాత్రం తాజాగా ఏపీకి మరో మూడు వేల కోట్లకు అనుమతి ఇచ్చారు. కానీ తెలంగాణ విషయం పట్టించుకోలేదు. కేవలం రాజకీయంగా కేసీఆర్ ను దెబ్బతియ్యడానికి కేంద్రం ఇలా అధికారాన్ని దుర్వినియోగం చెయ్యడం ఏంటని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కేసీఆర్ ను అడ్డుకోవాలన్న బీజేపీ చివరికి ప్రజలకే నష్టం చేస్తుంది. అయినా కులాలు,మతాలతో రాజకీయాలు చెయ్యాలనుకున్న బీజేపీ ప్రజలు బాగోగుల గురించి ఎందుకు ఆలోచిస్తుంది.

బీజేపీ నాయకులు ఉన్నారా!!

రాష్ట్రంలో ప్రజలిచ్చిన అధికార పదవిలో ఉంటూ బూతులు మాట్లాడుతూ తిరిగే బీజ్ నాయకులు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారో అర్ధంకావడం లేదు. రాష్ట్ర ప్రజల కోసం నిలబడతామని పాదయాత్రలు చేస్తున్న బీజేపీ నాయకులు ఈ విషయమై కేంద్ర బీజేపీ నాయకులను ఎందుకు ప్రశ్నించడం లేదని రాష్ట్ర ప్రజలు చర్చించుకుంటున్నారు. మత గొడవలను రెచ్చగొట్టడంలో పెట్టిన శ్రద్ధ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో బీజేపీ నాయకులు ఎప్పటికి పెట్టలేరు. అయినా కేసీఆర్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బీజేపీ నాయకులు ఇప్పట్లో దెబ్బతియ్యలేరు.

- Advertisement -