Bandi Sanjay: మతరాజకీయాలు చేస్తున్న బీజేపీ నాయకులను ఇష్టమొచ్చినట్టు ఎవరైనా, ఎప్పుడైనా తిట్టొచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసే పనులు అలా ఉంటాయి. కానీ ఇప్పుడు కల్వకుంట్ల కవిత విషయంలో మాత్రం బండి సంజయ్ ను బీఆర్ఎస్ నాయకులు కావాలని, ఏమి మాట్లాడాలో తెలియక, లిక్కర్ స్కాం విషయంలో బీజేపీని ఎలా విమర్శించాలో అర్థం కాకపోవడం వల్ల, అవసరం లేని మాటలను, అందులో తప్పు లేదని తెలిసినా, మా మాట నిజంగా ఆ ఉద్దేశంతో అనలేదని తెలిసినా కూడా సంజయ్ పై రాష్ట్రం మొత్తం ధర్నాలు, నిరసనలు చేస్తున్నారు. లిక్కర్ స్కాంలో కవితను ఈడీ అధికారులు నిన్న దాదాపు 8 గంటలపాటు విచారించారు. పైగా ఇప్పటికీ ఆమె ఫోన్స్ మొత్తం ఈడీ అధికారులతోనే ఉన్నాయ్. ఈ లిక్కర్ స్కాంలో బీఆర్ఎస్ నాయకులు విచిత్రమైన హడావిడి, భయం చూస్తుంటే ఈ స్కాంలో కవిత హస్తం ఖచ్చితంగా ఉందని తెలుస్తుంది. ఎందుకంటే ఈ స్కాములో కవిత హస్తం లేదంటే బీఆర్ఎస్ నాయకులు అవసరం లేని విషయంలో ఇంత హడావిడి చెయ్యాల్సిన అవసరం లేదు.

సంజయ్ ఈ మాటను మీన్ చేశాడా!!

లిక్కర్ స్కాం విషయంలో కవిత గురించి బండి సంజయ్ మాట్లాడుతూ…”లిక్కర్ స్కాంలో కవితను అరెస్ట్ చెయ్యకుండా ముద్దు పెట్టుకుంటారా”అని అన్నాడు. అయితే ఈ మాట ఒక ఫ్లోలో వచ్చిన మాటే తప్పా అది కావాలని అన్న మాట మాత్రం కాదు. ఈ విషయం బీజేపీ వాళ్లకు తెలుసు, బీఆర్ఎస్ వాళ్లకు కూడా తెలుసు. కానీ బీఆర్ఎస్ వాళ్లకు ఈ లిక్కర్ స్కాంలో ప్రజల నుండి ఎలా మద్దతు కూడగట్టుకోవాలో అర్థం కావడం లేదు. చాలా నిస్సహాయత సిట్యుయేషన్ లో ఉన్న వాళ్లకు ఇప్పుడు బండి సంజయ్ అన్న మాటను పట్టుకొని దానిపై రాష్ట్రం మొత్తం ధర్నాలు చేస్తున్నారు. ఒక మహిళను బీజేపీ వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూడంటి అంటూ బీఆర్ఎస్ నాయకులు ట్విట్టర్ లో హడావిడి చేస్తున్నారు.

బీజేపీ కూడా ఇలానే చేసేది!!

ఈ మతరాజకీయాలు చెయ్యడం తప్పా ప్రజల అభివృద్ధి గురించి ఏ మాత్రం తెలియని పార్టీ ఏదన్న ఉందంటే అది బీజేపీనే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కవితను అన్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు ధర్నాలు చేస్తున్నారు. ఒకవేళ ఇదే సిట్యుయేషన్ రివర్స్ లో ఉంటే, బీజేపీ వాళ్ళు చేసే హడావిడి అంతా ఇంతా ఉండేది కాదు. దేశ మహిళను అలా అన్నారు, ఇలా అన్నారు, దేశ భక్తి లేదు, మహిళలంటే గౌరవం లేదని ఇష్టమొచ్చిన మాటల్ని మాట్లాడే వాళ్ళు. ఈ బీజేపీ నాయకులు ఇప్పుడు కవిత తప్పు చేసిందని మాట్లాడుతున్నారు కానీ ఎందుకు బీజేపీలో ఉన్న అవినీతి పరులపై దాడులు జరగడం లేదని కానీ బీజేపీలో చేరిన వాళ్ళను ఎందుకు ఈడీ అధికారులు అరెస్ట్ చెయ్యడం లేదని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం ఉండదు. ఈ రాజకీయాలు చేసే చీప్ రాజకీయాలకు ఇదే నిదర్శనం.