Chiranjeevi: చిరంజీవి రాజకీయాల నుండి దూరంగా ఉంటూ మూవీస్ లో బిజీగా ఉన్నారు. అయన తమ్ముడు పవన్ కళ్యాణ్ మాత్రం వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించడానికి టీడీపీతో కలిసి వ్యూహాలు రచిస్తున్నారు. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ను ఎంత తిడుతున్నారో, చిరంజీవిని అంతే ఇష్టపడుతున్నారు. ఈ వైసీపీ వాళ్ళు పవన్ ఇలా తిడుతూనే, మళ్ళీ చిరును తమ పెళ్లిళ్లకు, వేరే ఫంక్షన్స్ కు పిలుస్తూ ఉంటారు. చిరు కూడా కాదనలేక వెళ్తూ ఉంటారు. అయితే వైసీపీ వాళ్ళు పవన్ కళ్యాణ్ ను కేవలం రాజకీయంగా తిట్టడం లేదు. ఆయన్ను వ్యక్తిగతంగా కు తిడుతూ ఉన్నారు. అలాంటివారితో కూడా చిరు క్లోజ్ గానే ఉంటున్నారు. ఈవిషయం కొంతమంది మెగా అభిమానులకు నచ్చడం లేదు. ఎందుకంటే ఇప్పుడు పవన్ ను అంతలా తిడుతున్నా వారితో చిరు నవ్వుతు మాట్లాడటాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరీ ఇంతమంచితనం పనికి రాదనీ మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .

ఇంతా మంచితనం ఎందుకు
మొన్నీమధ్యే చిరంజీవి మాట్లాడుతూ… నా తమ్ముడ్ని ఇష్టమొచ్చినట్టు మాట్లాడిన రాజకీయ నాయకులు కూడా మళ్ళీ వచ్చి, తనను వాళ్ళు ఫంక్షన్స్ పిలిచినప్పుడు అదోలా ఉంటుందని, నా తమ్ముడిదని తిట్టిన వాళ్ళ ఫంక్షన్స్ వెళ్లడం అవసరమా అని కూడా ఆలోచిస్తూ ఉంటానని “వెల్లడించారు. కానీ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు చింతల రామచంద్రా రెడ్డి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆయనతో సమావేశం అయ్యారు. ఈ నెల 27వ తేదీన చింతల రామచంద్రారెడ్డి కుమారుడు సాయి కృష్ణారెడ్డి- శ్రీయ వివాహ మహోత్సవానికి హాజరు కావాలని కోరారు. చిరంజీవికి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. సుమారు అరగంటకు పైగా అక్కడే గడిపారాయన. ఈ ఫంక్షన్ కు కూడా చిరంజీవి ఖచ్చితంగా వెళ్లారు. ఎన్నోసార్లు వైసీపీ వాళ్ళ ఫంక్షన్స్ కు చిరంజీవి వెళ్లారు. కానీ వైసీపీ వాళ్ళు పవన్ ను తిడుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ పెళ్ళికి వెళ్లినా కూడా పవన్ ను మళ్ళీ తిడుతూనే ఉంటారు.
రోజాను చూడలేదా!!
మంత్రి మొన్న మెగా ఫ్యామిలీ గురించి ఇంతా నీచంగా అంతా చూశారు. ఆమె మంత్రి అయినప్పుడు చిరంజీవి ఇంటికి వెళ్లి మరీ కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. కానీ మళ్ళీ బయటకు వచ్చి మెగా కుటుంబ సభ్యులకు రాజకీయాలు పనికి రావని, వాళ్ళను సొంత జిల్లాలోనే ప్రజలు ఓడించారని, చంద్రబాబు నాయుడు పల్లకి మోసే పవనూ ప్రజలు ఎందుకు నమ్ముతారని ఇష్టమొచ్చినట్టు మాట్లాడాడారు. ఇలా ఎంతోమంది నేతలు పవన్ ఇష్టమొచ్చినట్టు తిడుతూ, మళ్ళీ చిరును వాళ్ళ ఫంక్షన్స్ కు పిలుస్తూ ఉంటారు. చిరు వెళ్తూ ఉంటారు . అయితే ఇప్పుడు ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి, కాబట్టి ఇప్పుడైనా చిరంజీవి ఇలా వైసీపీ వాళ్ళ ఫంక్షన్స్ కు వెళ్లడం తగ్గిస్తే బాగుంటుందని మెగా అభిమానులు భావిస్తున్నారు.