DR. B.R AMBEDKAR: అంబేడ్కర్ లాంటి మహనీయుడి పేరు తమ జిల్లాకు పెడితే సంతోషించాల్సిన ప్రజలు ఇలా కుల పిచ్చితో అరాచకులు చేస్తున్నారు. అంబేడ్కర్ లాంటి వేరే దేశంలో పుడితే వాళ్ళు నెత్తిన పెట్టుకునే వాళ్ళు, వాళ్ళ ప్రాంతానికి అయన పేరు పెడితే గంతులు వేస్తూ ఆనందించే వాళ్ళు. కానీ మనలో చాలామందికి అంబేడ్కర్ అంటే రాజ్యాంగ నిర్మాత, దళిత నాయకుడు అన్న విషయాలు తప్ప మిగితా ఏ విషయాలు కూడా తెలియదు. పైగా దేశ ప్రగతి కోసం ఎన్నో పోరాటాలు చేసిన ఆయనను కేవలం ఒక దళిత వర్గానికి పరిమితం చేస్తూ, ఆయన స్థాయిని తగ్గించడానికి నిత్యం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు.

గాంధీ లాంటి నాయకులు ఒక సోషల్ ఈవిల్ పై పోరాడిన వ్యక్తిని మాత్రం ఒక క్యాస్ట్ కు పరిమితం చెయ్యకుండా కేవలం బాబాసాహెద్ అంబేడ్కర్ ను మాత్రం ఒక కులానికి పరిమితం చేస్తున్నారు. ఇలా చేస్తూ ఆయన గురించి ప్రజల చెప్పకుండా, విద్యాలయాల్లో ఆయన గురించి చెప్పకుండా ఆయన పేరును కేవలం రాజకీయాల కోసం, దళితుల ఓట్ల కోసం ఆయనను వాడుకుంటూ ఉంటారు.
విద్యాలయాల్లో చెప్పారా!!
దేశం కోసం పాటు పడ్డ నాయకుల గురించి స్కూల్ లెవెల్ చెప్తారు కానీ కుల నిర్మూలణ లాంటి సోషల్ ఈవిల్ పై , మహిళల హక్కుల కోసం, కార్మికుల కోసం పాటుపడ్డ గొప్ప అంబేడ్కర్ లాంటి నాయకుడిని గురించి మాత్రం చెప్పారు. ఆయన విగ్రహాలను పెడ్తూ, ఆయనను ఒక వర్గానికి చెందిన వ్యక్తిగా చేసి, ఆయన గురించి తెలుసుకోవాలన్న ఆలోచనను కూడా ఇతర వర్గాల ప్రజల్లో రాకుండా ఈ సమాజం తయారైంది. అంబేడ్కర్ దూర దృష్టితో తీసుకున్న నిర్ణయాలు గురించి ఇతర దేశాల్లో గొప్పగా చెప్పుకుంటారు కానీ ఆయన గురించి మాత్రం స్కూల్ లలో మాత్రం చెప్పారు. ఆయన గొప్పతనం గురించి తెలియకే కోనసీమలో ఈ అల్లర్లు జరుగుతున్నాయో లేదా కుల పిచ్చి వల్ల జరుగుతున్నాయో తెలియడం లేదు.
అంబేడ్కర్ పై కుల ముద్ర పోదా!
అంబేడ్కర్ పై కుల ముద్ర ఇంతా రుద్దబడిందంటే అయన విగ్రహాన్ని కూడా ఇతర వర్గాల తమ వీధుల్లో పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఇలా చేసింది మాత్రం రాజకీయ నాయకులు మాత్రమే, ఇలా చేసే అయన గొప్పతనాన్ని ఇతరులకు తెలియకుండా చేసి, ఈ మాత్రం జ్ఞానం లేని, ప్రజల పట్ల, సమాజం పట్ల భాధ్యతలేని నాయకులను మాత్రం దేశానికి పెద్దలను చేశారు. ఇంకెన్ని తారలు మారితే అంబేడ్కర్ ను కులానికి చెందిన వ్యక్తిగా కాక సంఘ సంస్కర్తగా, దేశ నాయకుడిగా ఈ దేశం గుర్తిస్తుందో.