Tdp, Janasena: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని టీడీపీ, జనసేన పార్టీ నేతలు ఎప్పటి నుండో ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చెయ్యడం వల్లే వైసీపీ గెలిచిందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఛాన్స్ వచ్చినప్పుడల్లా చెప్తూ ఉంటారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆతప్పు చెయ్యనని, వైసీపీని ఓడించడానికి ఎవరితోనైనా కలిసి ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. మొన్నటి వరకు టీడీపీ, జనసేన పొత్తు కంఫర్మ్ అయ్యిందని అందరు అనుకున్నారు. టీడీపీ, జనసేన నేతలు కూడా కలిసి పార్టీ కార్యకలాపాల్లో కనిపిస్తున్నారు . అయితే ఇప్పుడు తాజాగా ఈరెండు పార్టీలు మళ్ళీ కొత్త సంకేతాలను పంపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుండానే పోటీకి వెళ్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే రెండు పార్టీలు ఇలా చెయ్యాలనే వైసీపీ ఎప్పటి నుండో ప్లాన్ చేసింది, ఇప్పుడు రెండు పార్టీలు అదే చేస్తున్నాయి.
పొత్తు లేనట్టేనా!!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకొని వైసీపీని ఓడించడానికి ప్రయత్నిస్తున్నాయని మొన్నటి వరకు టాక్ నడిచింది. అయితే ఇప్పుడు మరోవార్త రాజకీయ వర్గాల్లో చర్చకు వస్తుంది. ఇప్పుడు ఈ రెండు పార్టీలు పొత్తుకు సిద్ధంగా లేవని, వచ్చే ఎన్నికలో విడిగానే పోటీ చేస్తున్నాయని, ఇలా చేస్తేనే వచ్చే ఎన్నికల్లో వైసీపీ చెక్ పెట్టొచ్చని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నాయని వార్తలు బయటకు వస్తున్నాయి. అందరి కలిసి తనపై మళ్ళీ గతంలోలానే పోటీకి వస్తున్నాయని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అంటూ ఉంటారు. ఈ విమర్శకు చెక్ పెట్టడానికే ఈ రెండు పార్టీలు ఇలా చేస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. పైగా ఇప్పటికే జనసేన బీజేపీతో పొత్తులో ఉంది, కానీ బీజేపీకి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ఇష్టం లేదు. అందుకే జనసేన బీజేపీతోనే ఉంటూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమైనట్టు సమాచారం.
వైసీపీకి మళ్ళీ గెలుపే
టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోకూడదనే ఎప్పటి నుండి ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇప్పుడు కరెక్ట్ గా ఈ రెండు పార్టీలు అదే చేస్తున్నాయి. పొత్తు పెట్టుకొని ఎన్నికలకు దిగితే తనకు ఓటమి తప్పదని తెల్సుకున్న వైసీపీ, ,మొదటి నుండి కూడా ఈరెండు పార్టీలను వేరు చెయ్యడానికే పవన్ ను దత్తపుత్రుడు అంటూ వచ్చాయి. అలా చెయ్యడం వల్లే ఇప్పుడు పొత్తు క్యాన్సల్ అయ్యిందని వార్తలు వస్తున్నాయి. అయితే జనసేన, టీడీపీ ఇలా పొత్తుపై రోజుకో సంకేతాన్ని ఇవ్వడంతో పార్టీ కార్యకర్తలు అయోమయానికి గురి అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రతి పార్టీ రోజుకో వ్యూహం రచిస్తున్నాయి. ఎన్నికల సమయానికి ఎవరు ఎవరితో పొత్తు పెట్టుకుంటాయో ఎవరికీ తెలియదు.