KCR: బీజేపీ- కేసీఆర్ మధ్య జరుగుతున్న యుద్ధం అందరికి తెలిసిందే. ఈ యుద్ధం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరి ఇప్పటికే ప్రెస్ మీట్స్ పెట్టి మరీ తిట్టుకుంటున్నారు. కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మోడీని, బీజేపీ నాయకులను ఇష్టమొచ్చినట్టు తిడుతుంటే ఇప్పుడు బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని కేసీఆర్ బీజేపీని తిడుతుంటే ఇప్పుడు బీజేపీ నాయకుడు పీయూష్ గోయల్ ప్రెస్ మీట్ లో ధాన్యం విషయంలో షాకింగ్ విషయాలను బయటపెట్టారు. ప్రజలకు ఫ్రీ గా ఇవ్వాల్సిన ధాన్యాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఇవ్వకుండా నొక్కేసిందని, అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చీప్ పనుల వల్లే తెలంగాణ నుండి ధాన్యం సేకరణ నిలిపివేశామని తెలిపారు. అయితే ఈ విషయాలను బయటపెట్టకుండా కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని పీయూష్ తెలిపారు. అయితే మొన్న ప్రెస్ మీట్ లో కేసీఆర్ పీయూష్ ను తిట్టడం వల్లే ఇప్పుడు బీజేపీ నాయకులు ఇప్పుడు ఈ కొత్త విషయాలను బయటపెట్టింది.
కేసీఆర్ ఇలా చేశాడా!!
పేదలకు అండగా ఉంటామని చెప్తున్నారు కానీ పేదలకు ఫ్రీ గా ఇవ్వాల్సిన ధాన్యాన్ని మాత్రం ఇవ్వకుండా ప్రభుత్వం ఆపేసిందని పీయూష్ తెలిపారు. గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద పేదలకు ఉచితంగా ఇచ్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని ప్రకటించింది. ఉచితంగా ఇవ్వాల్సిన బియ్యాన్ని పేదలకు పంపిణీ చేయలేదని కేంద్రం స్పష్టం చేసింది. ఏప్రిల్, మే రెండు నెలల కోటా లక్షా 90 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకుందని కానీ పేదలకు పంపిణీ చేయలేదని పీయూష్ గోయల్ ఆరోపించారు. పేదలకు మేలు చేయకుండా.. రాజకీయం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. అదే విధంగా అక్రమాలకు పాల్పడ్డ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలోనూ తెలంగాణ సర్కార్ విఫలమయిందని అందుకే సెంట్రల్ పూల్‌లోకి తెలంగాణ నుంచి బియ్యం సేకరణ నిలిపివేశామన్నారు. తప్పు తన దగ్గర పెట్టుకొని కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రాన్ని ఎందుకు తిట్టాడని రాజకీయూయ వర్గాలు చర్చలు చర్చించుకుంటున్నారు.
ఇన్ని రోజులు ఎందుకు దాచింది!!
కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు తెలిసిన బీజేపీ నాయకులు ఇప్పటి వరకు ఎందుకు ఈ విషయాలను దాచి ఉంచారని ప్రజలు బీజేపీ నాయకులకు ప్రశ్నలను సంధిస్తున్నారు. ఇందంతా ఏప్రిల్, మే నెలల్లో జరిగితే మొన్న మోడీ వచ్చినప్పుడే ఈ విషయాలు చెప్పి ఉంటె ప్రజలకు ఇంకా ఎక్కువ ఈ విషయం చేరేదని, పేదలకు అన్యాయం జరిగిన విషయంలో కూడా ఈ రాజకీయాలు ఎందుకని రాజకీయ విశ్లేషలు చెప్తున్నారు. మొత్తంగా పార్లమెంట్ సమావేశాలు ఎప్పుడు జరిగినా ధాన్యం అంశంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య వాదోపవాదాలు మాత్రం చోటు చేసుకుంటున్నాయి. అయితే బీజేపీని బ్యాడ్ చెయ్యడానికి కేసీఆర్, కేసీఆర్ ను బ్యాడ్ చెయ్యడానికి బీజేపీ ప్రయత్నిస్తూ ప్రజలను వేదవలను చేస్తున్నారు.