KCR: టీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా మారిన తరువాత కేసీఆర్ కు తెలంగాణ భావం తగ్గిందని ప్రతిపక్ష నాయకులు మొత్తం అంటూనే ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ చేస్తున్న పనులు కూడా అలానే ఉన్నారు. ఒకప్పుడు ఆంధ్రావాళ్లను తెలంగాణ నుండి వెళ్లిపోవాలని గొడవ చేసిన కేసీఆర్, ఇప్పుడు వాళ్లనే తెలంగాణాలో అందలం ఎక్కించడానికి సిద్ధమయ్యారు. ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడు సోమేశ్ కుమార్ విషయంలో కేసీఆర్ కు ఇప్పుడు తన తెలంగాణ వాదాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు ఈ విషయంలో కేసీఆర్ ను బీజేపీ వాళ్ళను రాజకీయంగా కించపరచడానికి సిద్ధమయ్యారు. సోమేష్ కుమార్‌ను సీఎస్ బాధ్యతల నుంచి తప్పించి ఏపీకి బదిలీ చేయాలని, 2014 రాష్ట్ర విభజన తర్వాత డీఓపీటీ ఇచ్చిన ఆదేశాలను తుంగలో తొక్కారని బీజేపీ నేతలు మండిపడ్డారు.
అవినీతి చెయ్యడానికేనా!!
గతంలో తెలంగాణ ప్రజలకు ఆంధ్రా వాళ్ళు అన్యాయం చేస్తున్నారని, ఆంధ్రా వాళ్ళ వల్లే మనకు అన్యాయం జరుగుతుందని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించడానికి మాత్రం ఏపీ వాళ్ళను కేసీఆర్ ఎంపిక చేసుకున్నారు. తెలంగాణకు కేటాయించిన ఎందరో అధికారులు సీనియారిటీ లిస్టులో ఉన్నారని, కానీ ఏపీ క్యాడర్ కు చెందిన సోమేష్ కుమార్‌ను సీఎస్‌గా నియమించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా లబ్ధిపొందారని విమర్శించారు. సోమేష్ ద్వారా 317 జీవో సహా అనేక ఉద్యోగ, ప్రజా వ్యతిరేక ఉత్తర్వులను విడుదల చేయించారని, రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, హోం తదితర శాఖల్లో తమకు అనుకూలమైన అధికారులను నియమించుకుని భారీగా అవినీతికి పాల్పడేందుకు సీఎస్ సోమేష్ కుమార్ ను ఒక పావుగా వాడుకున్నారని వెల్లడించారు.
బీజేపీ దీన్ని రాజకీయం చేయనుందా!!
కేసీఆర్ కు ఇప్పుడు తెలంగాణ వాదం తగ్గిపోయిందని, ఇప్పుడు అతనికి కేవలం అధికారం మాత్రమే కావాలని, అతనికి ఇప్పుడు తెలంగాణ అభివృద్ధి కేసీఆర్ కు అవసరం లేదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు కేసీఆర్ ను ఎలా కౌంటర్ చెయ్యాలో బీజేపీకి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని రాజకీయం చేసి, వాడుకోవడానికి చూస్తుంది. బీజేపీకి పాలసీల గురించి మాట్లాడి, వాటిలో ఉన్న తప్పులను ప్రజలకు చూపించడానికి బీజేపీ వాళ్లకు అంత తెలివి లేదు. అందుకే ఎప్పుడు ఇలా కులాన్ని, మతాన్ని రెచ్చగొడుతూ ఉంటుంది. అలాంటి బీజేపీ ఇప్పుడు ఈ విషయాన్ని వాడుకొని రాజకీయం చెయ్యాలని చూస్తుంది.