KCR: బంగారు తెలంగాణను ఏర్పాటు చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్, భావితరాలకు బంగారు భవిష్యత్ ను అందిస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు తెలంగాణ భావితరాలను నాశనం చెయ్యడానికి సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ఉన్న విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చెయ్యడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తున్నారు. పేద పిల్లలకు చదువు అందకూడదని కేసీఆర్ ప్రభుత్వం క్రూరంగా ప్రవర్తిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుండి గురుకుల పాఠశాల విద్యార్థులు, బాసర విద్యార్థులు నిత్యం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారిని ప్రభుత్వం అస్సలు పట్టించుకోవడం లేదు. వారికి ఇవ్వాల్సిన కనీస వసతులు ఇవ్వడంలో కూడా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొన్నటి వరకు బాసరా విద్యార్థులు తమకు కావలసిన కనీస వసతుల గురించి ధర్నా చెయ్యాల్సి వచ్చింది. ఈరోజు అక్కడ వండిన భోజనం తిని దాదాపు 1200 మంది విద్యార్థులు అనారోగ్యానికి గురి అయ్యారు. అయితే దీనిపై ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదు. గురుకుల పాఠశాల విద్యార్థులు చాలాప్రాంతాల్లో అక్కడ వండిన నాశిరకమైన ఫుడ్ వల్ల అనారోగ్యానికి గురి అయ్యారు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఇంతజరుగుతున్నా కూడా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదో అర్థం కావడం లేదు.
ఎందుకు పట్టించుకోవోడం లేదు!!
ప్రభుత్వ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులు నాసి రకమైన ఫుడ్ వల్ల అనారోగ్యనికి గురవ్వడం ఇదేమి మొదటిసారి కాదు. కానీ ప్రభుత్వం మాత్రం అస్సలు పట్టించుకోవడం లేదు. కేసీఆర్ అరాచకాలకు బలై విధుల నుండి తప్పుకున్న ఐఏఎస్ అధికారి మురళి చెప్పినట్టు కేసీఆర్ పేద విద్యార్థులకు అందిస్తున్న విద్యను నాశనం చెయ్యడానికి కృషి చేస్తున్నట్టు ఉన్నారు. భావి తరాలకు బంగారు భవిష్యత్తును అందిస్తానని చెప్పిన ఇప్పుడు నాశిరకమైన భోజనాన్ని పెడ్తూ వాళ్ళ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ధనిక రాష్ట్రం, దేశంలోనే అభివృద్ధిలో ముందని చెప్పుకుంటున్న కేసీఆర్ విద్యార్థులను మాత్రం అనారోగ్యం పాలు చేస్తున్నారు. వరదలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతున్నారు, హాస్టల్ విద్యార్థులు ఇలా ఇబ్బందులు పడుతున్నారు. మాట్లాడితే మోడీపై ఏడ్చే కేసీఆర్ మొదట రాష్ట్రంపై దృష్టి పెట్టాలని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
ప్రతిపక్షాలు పోరాడాలి
కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ప్రతిపక్షాల నేతలు పోరాడాలి. కేసీఆర్ ప్రభుత్వం విద్యార్థుల పట్ల, విద్య పట్ల వ్యవహరిస్తున్న తీరును ప్రజలకు వివరించి, ప్రభుత్వంపై ప్రజలు తిరగబడేలా చెయ్యాలి. ప్రతిపక్షాల నాయకులు ఇందులో రాజకీయాలను కలపకుండా, విద్యార్థుల జీవితం గురించి సంపూర్ణ న్యాయం జరిగే వరకు పోరాడి ఈ విద్యార్థులకు న్యాయం జరిగే ప్రతిపక్షాల నాయకులు ముందుకు రావాలి. లాస్ట్ బాసరా విద్యార్థులు ధర్నా చేస్తున్న సమయం బీఎస్పీ లీడర్ ప్రవీణ్ కుమార్ అక్కడి వెళ్లి ధర్నా కూడా చేశారు. ఇప్పుడు ప్రవీణ్ కుమార్ మళ్ళీ విద్యార్థుల పక్షాన నిలబడే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ హాస్టల్స్ కు ఒక నాణ్యత తీసుకొచ్చిన ఆఫీసర్ కాబట్టి.