Lokesh: టీడీపీకి గతవైభావాన్ని తీసుకోని రావడానికి నారా లోకేష్ కూడా చాలా కష్టపడుతున్నారు. టీడీపీలోని చంద్రబాబు నాయుడు ఎంత కష్టపడుతున్నాడో అంత కంటే ఎక్కువగా నారా లోకేష్ కష్టపడుతున్నారు. రాష్ట్రం మొత్తం పాదయాత్ర చెయ్యడానికి సిద్ధమై , ఇప్పుడు 46వ రోజు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం, చీకటిమానిపల్లి విడిది కేంద్రం నుంచి పాదయాత్ర మళ్ళీ ప్రారంభమైంది. అయితే ఈ పాదయాత్రలో లోకేష్ కాస్త ఇబ్బందిగా కనిపించారు. ఎందుకంటే ఆయన భుజాలకు గాయమైన్నందున కాస్త ఇబ్బందు పడుతూ పాదయాత్రను కొనసాగించారు. అయితే ఈవిషయాన్ని లోకేష్ కానీ , టీడీపీ వాళ్ళు కానీ ఎక్కడా ప్రకటించలేదు కానీ అయన నడుస్తున్నప్పుడు మాత్రం కాస్త ఇబ్బందిగా కనిపించారు. ఇదే విషయంపై సోషల్ మీడియా తెలుగు తమ్ముళ్లు చర్చలు జరుపుతున్నారు. పార్టీ కోసం లోకేష్ ఇంతలా కష్టపడుతున్నాడని, వచ్చే ఎన్నికల్లో ఈ కష్టానికి ఫలితం దక్కుతుందని టీడీపీ నాయకులు చెప్తున్నారు.

కష్టం ఒకే బట్ కంటెంట్ ఏది!!
నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడనే తప్పా అసలు అందులో ఎక్కడ ఏమి మాట్లాడుతున్నాడో ఎవ్వరికి తెలియడం లేదు. కష్టపడుతూ ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు కానీ ప్రభుత్వాన్ని ఎక్కడా బలంగా ప్రశ్నిస్తున్నట్టు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు చెప్తున్నట్టు కానీ ఎక్కడా కనిపించడం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినప్పుడు, ఆ యాత్రలో అతను ఎక్కడికి వెళ్లినా అక్కడ ఏమి మాట్లాడాడు అన్న విషయంపై రాష్ట్రం చర్చలు జరిగేవి, వైసీపీ వాళ్ళు అంతలా ప్రచారం చేసే వాళ్ళు. కానీ ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో కష్టం కనిపిస్తుంది కానీ ఎక్కడా కంటెంట్ తో కూడిన స్పీచ్ లు కనిపించడం లేదు. ఇదే ఇప్పుడు లోకేష్ పాదయాత్రలో లోపించిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
టీడీపీని లీడ్ చేస్తాడా!!
మొన్నటి వరకు అసలు లోకేష్ పాదయాత్ర కనీసం ఒక్క వారమైనా చేస్తాడా అని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు ఆ పాదయాత్ర దాదాపు 50 రోజులకు చేరుకుంది. ఇప్పుడు లోకేష్ లో ఉన్న పట్టుదల చూస్తే వచ్చే ఎన్నికల వరకు టీడీపీలో కీలక నేతగా మారుతాడనిపిస్తుంది. ఇలాగే కష్టపడితే భవిష్యత్ లో టీడీపీని కూడా నడిపించగలడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయితే మొన్నటి వరకు లోకేష్ కు మాట్లాడటానికి రాదనీ అన్న వాళ్ళు ఇప్పుడు ఆ కామెంట్స్ చెయ్యకుండా లోకేష్ ను కూడా సీరియస్ పొలిటిషన్ గా చూస్తున్నారు.