Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి వస్తుండటంతో బీజేపీ ఎంత హడావిడి చేసిందో తెరాస నాయకులు కూడా అంతే హడావిడి చేశారు. బీజేపీకి ప్రచారానికి కూడా తెరాస ఇష్టమొచ్చినట్టు అడ్డుపడింది. మోడీ దేశాన్ని దోచేస్తున్నాడని హైదరాబాద్ మొత్తం పోస్టర్ వేయించారు. అయితే ఇవన్నీ జరుగుతుండటంతో మోడీ రాష్ట్రానికి వచ్చినప్పుడు కేసీఆర్ ను ఒక ఆట ఆడుకుంటాడని అందరు అనుకున్నారు కానీ దానికి పూర్తిగా బిన్నంగా జరిగింది. కనీసం మోడీ కేసీఆర్ పేరును కూడా పలకలేదు. అసలు తెలంగాణలో ఉన్న ప్రభుత్వాన్ని అసలు మోడీకి తెలియదన్నట్టు మోడీ ప్రవర్తించారు. అయితే ఇక్కడ మోడీ స్పీచ్ విని తెరాస నాయకులు తెగ ఫీల్ అవుతున్నారు. ఒకవేళ మోడీ తన నేత కేసీఆర్ ను తిడితే దాన్ని రాజకీయంగా వాడుకుంటూ ఎన్నికలకు వెళ్లొచ్చని అనుకున్నారు కానీ మోడీ అసలు కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్ల కేసీఆర్ తో సహా తెరాసా నేతలందరు భాదపడుతున్నారని సమాచారం.
కేసీఆర్ ను పట్టించుకోలేదు!!
మోడీ ఇక్కడికి వస్తున్నాడని తెలిసినప్పుడే కేసీఆర్ ను టార్గెట్ చేస్తారని అంతా అనుకున్నారు కానీ ఇప్పుడు మోడీ రివర్స్ స్ట్రాటజీ ప్లే చేసి అసలు కేసీఆర్ పేరును కూడా పలకలేదు. అయితే ఇదంతా ఒక పథకం ప్రకారమే జరిగిందని, కావాలనే మోడీ కేసీఆర్ ను ప్రస్తావించలేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. జాతీయ కార్యవర్గ సమావేశాల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం బీజేపీని ఎంత రెచ్చగొట్టినా.. మోదీ పట్టించుకోలేదు. పోటీగా పోస్టర్లు.. ప్రచారం దక్కకుండా వ్యూహాలు.. బీజేపీ నేతల్ని పార్టీలో చేర్చుకోవడం వంటి వ్యూహాలను అమలు చేసినా మోదీ.. కేసీఆర్ పేరు కూడా ఎత్తలేదు. ఆయనకు అనవసరంగా ప్రాధాన్యత ఇస్తే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం తెచ్చినట్లవుతుందన్న ఉద్దేశంతో మోదీ లైట్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది.
సభ డల్ గా సాగిందా!!
మోడీ కేసీఆర్ ను ఖచ్చితంగా విమర్శిస్తారని బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరు అనుకున్నారు, దానికే ఫిక్స్ అయ్యారు. అయితే మోడీ వచ్చి ఇలా కేసీఆర్ ను ఒక్క మాట అనకుండా, ఇలా సభను డల్ గా ముగించడంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు కూడా నిరుత్సహానికి గురి అయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. కేవలం రాష్ట్రానికి కేంద్రం ఏం చేస్తుందో, చేసిందో మాత్రమే చెప్పి మోడీ వెళ్లిపోవడంతో బీజేపీ నాయకులకి ఈ సభ పెద్దగా కలిసి రాలేదని, అనుకున్నంత క్రేజ్ కూడా మోడీ రాక వల్ల రాలేదని బీజేపీ నేతలు బాధపడుతున్నారు .