Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను అభిమానించే వాళ్లలో అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తానూ కేవలం కాపు కులాలకు మాత్రమే హీరో అని అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తున్నప్పుడే కులాలకు, ప్రాంతాలకు, మతాలకు వ్యతిరేకంగా రాజకియాలు చేస్తానని చెప్పిన పవన్ ఇప్పుడు ఈ కులాల ఉచ్చులో ఇరుక్కుపోయారు. వైసీపీ వాళ్ళు దీన్నే అదునుగా తీసుకోని పవన్ కళ్యాణ్ కేవలం ఒక కులానికి మాత్రమే నాయకుడు అని ప్రచారం చెయ్యడం మొదలు పెట్టింది. రాజకీయాల్లో ఏ ఒక్క కులమో ఓట్లు వేస్తె ఎవరూ అధికారంలోకి రారు. ప్రతి ఒక్కరి మద్దతు కావలి, ఇప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కాపు కుల రాజకీయాలు చుట్టుకున్నాయి. పవన్ కూడా ఒక సభలో మాట్లాడుతూ… కనీసం తన కులం(కాపు) వాళ్ళు తనకు ఓటు వేసినా తాను గెలిచే వాడినని చెప్పుకున్నారు. కులాల పేరుతో నిత్యం జరిగే అకృత్యాలను చూస్తూ కూడా ఇలా పేరుతో ఓట్లు అడుగుతున్నాడు.

కాపులకు పవన్ చేసిందేమి లేదా!!
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, జనసేన మాజీ నాయకుడు ఐన పాపిశెట్టి రామ్మోహన్‌రావు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాపు ప్రజల్లో, నాయకుల్లో దుమారాన్ని రేపుతున్నాయి. సినిమా వాళ్ళను నమ్ముకుంటే కాపు కులానికి జరిగే మేలు ఏమి లేదని, తమలో నుండి వచ్చిన వారికే మద్దతుగా నిలిస్తేనే బాగుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. రామ్మోహనరావు చెప్పిన విషయాలు చాల వరకు కరెక్ట్(కుల పిచ్చి పాయింట్ అఫ్ వ్యూ). . పైగా విశాఖ కాపునాడు సభకు సంబంధించి వాల్‌పోస్టర్లలో పవన్ కల్యాణ్ ఫొటోలు ఉండడం వివాదాస్పదమైంది. మరోవైపు ఈ సభకు రాజకీయాలకు అతీతంగా ఆహ్వానిస్తూ, కేవలం జనసేనాని పవన్ ఫొటోలు మాత్రమే పెట్టడం వెనుక ఉద్దేశం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది.
పవన్ కొత్త రాజకీయాలు ఇవేనా!!
ఒక వ్యక్తి నాయకుడిగా ఎదగాలంటే అన్ని వర్గాల ప్రజల మద్దతు కావాలి. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తనకు కేవలం కాపు వాళ్ళ ఓట్లు ఉంటె సరిపోతుందని అనుకుంటున్నాడు. అందుకే ఒక మీటింగ్లో, కుల వనభోజనాల్లో తన ఫోటోలు పెట్టినా ఖండించడం లేదు. పైగా కుల భావాన్ని ప్రజల్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ ఇలా రాజకీయాలు చేస్తే వచ్చే ఎన్నికల్లో కూడా ఒక్క సీట్ గెలవకుండా మళ్ళీ సినిమాలు చేసుకుంటూ ఇంట్లో కూర్చోవాలి. లాస్ట్ ఎన్నికల్లోనే రెండు స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఇలా కులాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చెయ్యాలనుకుంటే మాత్రం మళ్ళీ ఓటమి [తప్పదు.