Chiranjeevi: చిరంజీవికి రాజకీయాలు అస్సలు సూట్ కావని, వాటికి చిరంజీవి దూరంగా ఉండటమే మంచిదని వాల్తేర్ వీరయ్య మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో డైరెక్టర్ బాబీ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాల మంది అభిప్రాయం కూడా ఇదే. చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లకుండా సినిమాల్లోనే ఉండి, ఉంటే ఇప్పటికే ఆయన రేంజ్ ఎక్కడో ఉండేది. ఇప్పటికి కూడా ఆయన రేంజ్ ఏంటో వాల్తేర్ వీరయ్యతో మళ్ళీ చూపించాడు. అయితే ఈ రాజకీయాలు మాత్రం ఆయనను వదలటం లేదు. మొన్నటి వరకు మళ్ళీ తమ్ముడు పవన్ కళ్యాణ్ కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడని లేదా జగన్ మోహన్ రెడ్డి కోసంవైసీపీ కోసం పని చేస్తారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ కోసం పని చేస్తాడని ఇలా చాలా రకాల వార్తలు వస్తూనే ఉన్నాయ్. తానూ రాజకీయాలకు దూరంగా ఉన్నానని చిరంజీవి ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఈ వార్తల్లోకి కాంగ్రెస్ నాయకులు వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్ కోసం చిరంజీవి పని చేస్తాడని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మళ్ళీ కాంగ్రెస్ కోసం వస్తారా!!
తానూ పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చిరంజీవి ఎంత గట్టిగా చెప్పినా కూడా ఎవ్వరూ వినటం లేదు. ఇప్పుడు ఏపీ కాంగ్రెస్ పీసీసి చీఫ్ గిడుగు రుద్రరాజు చిరంజీవిపై చేసిన వ్యాఖ్యల వల్ల మళ్ళీ చిరంజీవి రాజకీయాల్లోకి వస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఇంకాఆ కాంగ్రెస్ లోనే ఉన్నారని, సినిమాల్లో బిజీగా ఉండటం వల్లే చిరంజీవి రాజకీయాలకు దూరంగా ఉన్నారని తెలిపారు. చిరంజీవికి రాహుల్ గాంధీ, సోనియాతో మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎవ్వరితో పొత్తు పెట్టుకోవడం లేదని, 175 స్థానాల్లో పార్టీ పోటీ చేస్తుందని రుద్రరాజు తెలిపారు. ఇప్పుడు రుద్రరాజు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చిరును వదిలేయండి అయ్యా
చిరంజీవిని స్క్రీన్ మీద చూడటం ఒక చెప్పలేని ఆనందం. చిరంజీవి డాన్స్ చేసినా, ఫైట్ చేసినా, కామెడీ చేసినా చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. అలాంటి చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం వల్ల ఆయనను ప్రేక్షకులు ఎంతో మిస్ అయ్యారు. ఇప్పుడు అయన మళ్ళీ మూవీస్ లోకి వచ్చి, ఆక్ట్ చేస్తుంటే ప్రేక్షకులు పిచ్చెక్కిపోతున్నారు. వాల్తేర్ వీరయ్యలో వింటేజ్ చిరంజీవిని చూసిన ప్రేక్షకులు మెంటలెక్కి పోతున్నారు. సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీని జనాలు విపరీతంగా ఆదరిస్తున్నారు, చిరంజీవి మళ్ళీ తమకు అసలైన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడని ఆనందపడుతున్నారు. ఈరాజకీయాల వల్ల ఎవడికి లాభమో ఎవడికి నష్టమో ఎవరికి తెలియదు. రాజకీయాలు చెయ్యడానికి పనికిమాలిన నాయకులు చాలామంది ఉన్నారు వాళ్ళు చేస్తారు. చిరంజీవిని మాత్రం రాజకీయాలకు దూరంగా సినిమాల్లోనే ఉంచితే అదే ప్రజాసేవ.