RGV: ఇండియాస్ గ్రేటెస్ట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు మెగా ఫ్యామిలీకి తానూ పెద్ద అభిమానినని చెప్పుకుంటూ ఉంటారు. అందుకే మెగా ఫ్యామిలీ ఏమి చేసినా కూడా దానిపై స్పందిస్తూ ఉంటారు. ఇప్పుడు వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై పడ్డారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ ప్రచారాల కోసం తయారు చేసుకున్న వారాహి వాహనానికి నిన్న పూజలు చేయించారు. నిన్న మొత్తం వార్తల్లో కూడా ఇదే ప్రధానంగా చూపించారు. అయితే ఈ వాహనానికి పెట్టిన పేరుపై ఆర్జీవీ తనదైన శైలిలో స్పందించారు. గుడిలో ఉంటేనే వారాహని, బయట ఉంటే పందని ఆర్జీవీ ట్వీట్ చేశారు. జనసేన వాహనాన్ని కామెడీ చెయ్యడానికి ఆర్జీవీ తన వంతు చాలా ప్రయత్నలు చేస్తున్నారు. ఇదే అదునుగా చూసుకొని వైసీపీ వాళ్ళు కూడా ఆర్జీవీకి మద్దతు పలుకుతున్నారు. పంది బస్సు వాహనం అనే హ్యాష్ ట్యాగ్ ను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు.

పంది వాహనమా!!
గుడిలో ఉంటేనే వారాహి అని, అదే జంతువు బయట ఉంటే పందని అంటూ మొరుగుతున్న వాళ్ళ నోళ్లను పవన్ కళ్యాణ్ మూయించాలని, ఆ పేరు పెట్టి ఈ దేవుణ్ణి పవన్ కళ్యాణ్ అవమానించాడని అంటున్న వాళ్లకు పవన్ తిరిగి సమాధానం చెప్పాలని ఆర్జీవీ ట్వీట్ చేశారు. అలాగే ఎన్టీఆర్ చైతన్య రథంపై తిరుగుతుంటే, పవన్ కళ్యాణ్ పంది వాహనంపై తిరుగుతున్నాడనే వాళ్ళను అదే బస్సు టైర్స్ కిందవేసి తొక్కించాలని, ఒకవేళ చట్టం దానికి ఒప్పుకోకుంటేకనీసం కేసులన్నా పెట్టాలని ఆర్జీవీ తెలిపారు. ఆర్జీవీ మొత్తానికి వారాహిని కామెడీ చెయ్యాలని, ఇందంతా చేస్తున్నాడని, వైసీపీ ఆర్జీవీ వెనకాల ఉందని జనసేన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే పవన్ ను ఆర్జీవీ వివేకానందాతో పోలుస్తునే, హిట్లర్ అని కూడా అంటున్నారు.
వివేకానందా-హిట్లర్
పవన్ ను ఆర్జీవీ స్వామి వివేకానందతోనూ, హిట్లర్ తోనూ పోలుస్తున్నారు. హిట్లర్, వివేకానందా పవన్ కళ్యాణ్ యొక్క కుడి కాలును, ఏడవ కాలును లిక్ చేసేంత పెద్ద స్టార్ పవన్ కళ్యాణ్ అని వ్యగ్యంగా ట్వీట్ చేశారు. హిల్టేర్ వాహనంపై వివేకానందలా పవన్ ఉన్నారని జనసైనుకులను రెచ్చగొట్టేలా నిన్నటి నుండి ట్వీట్స్ చేస్తూ ఉన్నారు. పైగా పందిబస్సువాహనం అనే హ్యాష్ ట్యాగ్ కూడా ఆర్జీవీ వల్ల ట్రెండ్ అయ్యేలా ఉంది. అయితే జనసేన కార్యకర్తలు మాత్రం వచ్చే ఎన్నికల కోసం చాల కష్టపడుతున్నారు. ఇప్పటికీ బీజేపీతో పొత్తులో ఉన్నామని, బీజేపీ కలిసి రాకపోతే వేరే వాళ్లతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తాము. ఏది కుదరకపోతే వచ్చే ఎన్నికలకు ఒంటరిగానే వెళ్తామని పవన్ తెలిపారు . ఈరోజు కూడా వారాహి వాహనానికి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ దగ్గర కూడా పవన్ కళ్యాణ్ పూజలు చెయ్యనున్నారు.