DIVYAVANI:టీడీపీ తన గొయ్యి తానూ తీసుకోవడంలో ముందుంటుంది. గతంలో జగన్ విషయంలో అత్యుత్సాహంతో ఇబ్బందులకు గురి, అధికారాన్ని కక్షసాధింపు చర్యలకు పాల్పడి జగన్ ను హీరోను చేసి, 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని వైసీపీకి ఇచ్చింది. ఇప్పుడు అంధకారంలో ఉండి, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ, పార్టీలో ఉన్న నాయకులను కూడా కాపాడుకోలేకపోతుంది. సొంత నేతలనే, సొంత కార్యక్రమాల్లో అవమానిస్తూ పార్టీకి దూరం చేసుకుంటున్నారు. ఇప్పుడు టీడీపీలో అధికారం ప్రతినిధిగా ఉన్న దివ్యవాణికి మహానాడు కార్యక్రమంలో ఘోర అవమానం జరిగింది. సభలో దాదాపు అందరు మాట్లాడారు కానీ దివ్యవానికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదు.

దింతో ఆమె హర్ట్ అయ్యారు. ఇప్పుడు తెదేపాపైనే తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు.
శవ రాజకీయాలు చేస్తారు
మహానాడు కోసం ఎంతో కష్టపడి, అర్ధరాత్రి ప్రయాణం చేసి వచ్చానని, తనకు ఆరోగ్యం బాగోలేకపోయినా కూడా వచ్చానని, అయినా కూడా తనకు సభలో తగిన గౌరవం ఇవ్వలేదని దివ్యవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆరోజు వస్తున్నా క్రమంలో తనకు ఏమైనా జరిగినా కూడా టీడీపీ పట్టించుకునేది కాదని, వీలైతే తన శవంతో రాజకీయం చేసేవాళ్ళని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహానాడులో తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వలేదో అర్ధం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సొంత నేతలను కూడా టీడీపీ అవమానిస్తూ , తన గొయ్యి తానె తీసుకుంటుంది.
వైసీపీకి సంకేతాలు
తానూ దేవుడి బిడ్డనని, అవకాశం వస్తే వైసీపీలోకి వెళ్తానని, అక్కడ తనలాంటి చాలామంది ఉన్నారని, అక్కడైనా తనకు గౌరవం దక్కుతుందని ఆమె వైసీపీకి నేరుగా సంకేతాలు పంపుతుంది. ఇప్పుడు ఒకవేళ దివ్య వైసీపీలోకి వెళ్తే టీడీపీ ఒక ఫైర్ బ్రాండ్ ను మిస్ అయ్యినట్టే. టీడీపీ ఈ విషయంలో తొందరగా స్పందించకుంటే దివ్యవాణి వైసీపీలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది. దివ్యవాణి విషయంలో వైసీపీ నాయకులు ఆసక్తిగా ఉన్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.