KCR: కేసీఆర్ జాతీయ పార్టీగా మారిన తరువాత తెలంగాణలోకి ఇష్టమొచ్చిన పార్టీలన్నీ వస్తున్నాయి. అయినా కేసీఆర్ ఏమి చేయలేకపోతున్నారు . ఎందుకంటే ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారుస్తూ జాతీయ పార్టీగా చెయ్యడంతో వేరే రాష్ట్రం నుండి వస్తున్న పార్టీలకు ఇప్పుడు తెలంగాణ ఫ్రీ గ్రౌండ్ గా కనిపిస్తుంది. అందుకే ఇష్టమొచ్చిన ప్రతి పార్టీ నాయకుడు ఇక్కడికే వచ్చి తానే ఇక్కడ సీఎం కాబోతున్నానని చెప్పుకుంటున్నారు. ఇలాగే మొన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణకు వచ్చి, సభ పెట్టడమే కాకుండా బీఆర్ఎస్, కాంగ్రెస్ లోకి వెళ్లిన టీడీపీ నాయకులు మళ్ళీ తిరిగి రావాలని ప్రసంగించారు. ఇలా ఇష్టమొచ్చిన పార్టీలన్ని వస్తూ ఉంటె వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పోటీ విపరీతంగా పెరగనుంది. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ లాంటి ప్రధాన పార్టీల నుండి గట్టి పోటీ ఉండగా ఇప్పుడు షర్మిల, కేఏ పాల్, చంద్రబాబు నాయుడు ఇలా వచ్చి బీజేపీకి మద్దతు ఇస్తూ ఉన్నాయ్.
కేసీఆర్ ఎక్కడికి వెళ్తే అక్కడికే బాబు
కేసీఆర్ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ తరపున జాతీయ స్థాయిలో రాజకీయాలు చేస్తూ, వేరే రాష్ట్రాల్లో కూడా పార్టీ నుండి అభ్యర్థలకు నిలబెట్టడానికి కేసీఆర్ సిద్ధమైయ్యారు. దీని కోసం ఎక్కడైతే తెలుగు వాళ్ళు అధికంగా ఉన్నారో అక్కడ బీఆర్ఎస్ తరపున అభ్యర్థులను నిలబెట్టడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇలా బీజేపీని దెబ్బతియ్యడానికి విశ్వప్రయత్నాలు చేస్తుండగా బీజేపీ కూడా మరో అద్భుతమైన వ్యూహంతో రంగంలోకి చంద్రబాబు నాయుడును దింపింది. కేసీఆర్ ఎక్కడికి వెళ్లి పోటీ చెయ్యాలని అనుకున్నా అక్కడికి వెళ్ళడానికి బాబును బీజేపీ నాయకులు ప్రోత్సహిస్తున్నారు. రానున్న కేసీఆర్ మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడువంటి రాష్ట్రాల్లో పోటీకి సిద్ధమవుతున్న నేపథ్యంలో టీడీపీకి ఆ రాష్ట్రాల్లో పోటీకి దిగనుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
బీజేపీకి విజయం వరిస్తుందా!!
ఇప్పుడు తెలంగాణాలో కేసీఆర్ ను ఓడించడానికి కాంగ్రెస్, బీజేపీ , టీడీపీ, జనసేన, షర్మిల, కేఏ పాల్ ఇలా చాలామంది నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే వీళ్ళలో చాలామంది బీజేపీకి తొత్తులుగా పని చేస్తున్నారు. వారిలో మొదటి వరుసలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, షర్మిల ఉండగా, వీరి తరువాత కేఏ పాల్ ఉన్నారు. ఇలా వీళ్ళందరూ బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బీజేపీకి విజయం వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, వీళ్లందరి మద్దతు బీజేపీకి వరంగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణాలో బీజేపీ ఫుల్ స్వింగ్ లో ఉంది. ఈ ఊపులో బీజేపీ గెలిచినాఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.