Agneepath: దేశ భద్రతా రంగంలో వేతనాల భారాన్ని, పెన్షన్స్ తగ్గించడానికి మాత్రమే ఈ అగ్నిపథ్ కార్యక్రమాన్ని ప్రారంభించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఈ కార్యక్రమంపై ఆర్మీలో చేరాలని సిద్ధమైన యువత ఈ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తుంది. ఈ విధానాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని దేశం మొత్తలో ధర్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలోని సికింద్రాబాద్ లో యువత ధర్నాలు చేస్తూ రైల్స్ కు నిప్పంటించారు. ఈ గొడవల్లో పోలీసులు కాల్పులు జరపగా ఒకరికి గాయాలు కాగా మరొకరు మరణించారని సమాచారం.
అగ్నిపథ్ అంటే ఏందీ:
ఈ కార్యక్రమం కింద 17. 5-21 సంవత్సరాల వయసు గల యువతను అగ్నిపథ్ కార్యక్రమం కింద ర్యాలీలు నిర్వహించి విద్యాసంస్థల నుండి ఎంపిక చేసుకొని, వారికి 3.5 సంవత్సరాల వరకు శిక్షణ ఇచ్చి, వీరిలో నుండి కేవలం 25% మంది మాత్రమే ఎంపిక చేసుకొని వారిని మరో 15 సంవత్సరాలు ఆర్మీలో పని చేసే అవకాశం చేసే కలిపిస్తారు. ఇలా ఎంపిక ఐన వారిని అగ్నివీర్స్ అంటారు. ఇలా మొత్తం వీరిలో నుండి మొత్తం 40000 మందిని ఎంపిక చేస్తున్నారు. ఇలా ఎంపిక ఐన వారికి 40 వేల జీతం ఇస్తూ, వెళ్లిపోయేటప్పుడు పదకొండు లక్షల రూపాయలను వారి ఖాతాల్లో వేయనున్నారు. అలాగే ఎడ్యుకేషన్ లోన్స్ కు అవకాశం కలిపించనున్నారు. అయితే ఈ కార్యక్రమాన్ని యువత తప్పు పడుతున్నారు. ఇప్పటికి వరకు పరీక్ష విధానంలో ఎంపిక చేసే ప్రభుత్వం , రేపు ఎక్సమ్ ఉందనగా దాన్ని ఆపేసి, ఈ అగ్నిపథ్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడంతో యువత ఆగ్రహానికి గురి అయ్యారు.
ఇలా ఎంపిక చేసి వాళ్ళతో పని అయిపోయిన తరువాత వాళ్లను తరువాత గాలికి వదిలెయ్యడం అనేది చాలా తప్పు ప్రక్రియ. ఒకవేళ వాళ్ళు 4 ఇయర్స్ తరువాత ఎంపిక కాకుంటే అప్పుడు బయటకు వచ్చి వాళ్ళు ఎలా బతుకుతారనేది ఇప్పుడు యువత ప్రశ్న. అయినా ఇప్పుడు సడన్ గా కేంద్రానికి ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటో కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పలేదు. అలాగే అగ్నిపథ్ పేరుతో ఆర్మీలోకి ఆర్ఆర్ఎస్ వాళ్ళను తీసుకోవడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేశం మొత్తం జరుగుతున్న ధర్నాలు ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.