Ys Jagan Mohan Reddy: తాము అధికారంలోకి వస్తే మద్యాన్ని పూర్తిగా నిషేధించి కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రం పరిమితం చేస్తామని గత ఎన్నికల సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రకటన చూసి చాలామంది సంతోషించారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని మర్చిపోయారు. ఎవరన్నా ఈ హామీల గురించి అడిగితే తమకు అవగాహనా లేకుండా అప్పుడు ప్రకటించామని మెల్లగా చెప్తున్నారు. సీపీఎస్ ను రద్దు చేస్తామని ప్రకటించి, అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం దాన్ని రద్దు చెయ్యడం మాత్రం కుదరదని వైసీపీ నాయకులూ ప్రకటిస్తున్నారు . అప్పుడంటే తమకు అవగాహనా లేకుండా హామీ ఇచ్చామని, ఇప్పుడు ఆలోచిస్తే రద్దు చెయ్యడం కుదరదని వైసీపీ నాయకులు చెప్తున్నారు.

అలాగే ఇప్పుడు మద్యం విషయంలోనూ వైసీపీ ఇలాగే చేస్తుంది. మద్యాన్ని నిషేధిస్తామని చెప్పి, ఇప్పుడు కుదరదన్నట్టు ప్రవర్తిస్తున్నారు. అయితే మద్యాన్ని ప్రోత్సహిస్తూ విద్యను పక్కన పెట్టడానికి వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది.
కొత్త లైసెన్స్ లు
మద్యం నిషేధాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఇప్పుడు రాష్ట్రంలో బార్ల లైసెన్సుల్ని మళ్ళీ పొడిగించారు. రాష్ట్రంలో మద్య నిషేధం అన్న ఊసే భవిష్యత్తులో వుండబోదన్నమాట. అంటే ప్రజలను వెర్రి వాళ్ళను చేస్తూ అమలుకు సాధ్యం కానీ హామీలను కూడా ఇస్తున్నారు. ఇప్పటికే అలాంటి హామీలను ఎన్నో ఇచ్చి వాటిని అమలు చెయ్యడం కాదని తరువాత తెల్సుకుంది. ఇలా ప్రజలను వెదవలను చెయ్యడమే వైసీపీ నాయకులూ పనిగా పెట్టుకున్నారు. ఇలా ప్రజలను మోసం చేస్తూనే ఎదో ఒకరోజు వాళ్ళు తిరగబడి వైసీపీకి బుద్ది చెప్తారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే ప్రజల్లో వైసీపీపై వ్యతిరేకత మొదలైంది, ఎన్నికలొస్తే ఆ వ్యతిరేకత బయటపడనుంది.
విద్యను పక్కన పెట్టింది
అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ అని సీఎం జగన్ అందర్నీ ఊరించారు. లక్షల మంది అభ్యర్థులు ఆశపడ్డారు. మూడేళ్లయిందది ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోగా.. రేషనలైజేషన్ పేరుతో పూర్తిగా స్కూళ్లను తగ్గించేస్తున్నారు. ఏకోపాధ్యాయ పాఠశాలలను పెంచుతున్నారు. పైగా ఇప్పుడు బైజూస్ తో ఒప్పందం చేసుకుంది కాబట్టి రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్య ఎలా ఉంటుందో కూడా ఊహించుకోలేము. ఈ ఒప్పందం వల్ల టీచర్స్ నోటిఫికేషన్ కూడా రాదని అర్థమైతుంది. బైజూస్ రికార్డెడ్ క్లాస్ లు విన్పించే దానికి ఇంకా టీచర్స్ తో ఏం పని ఉంటుంది. ఇలా విద్యను నిర్లక్ష్యం చేస్తూ మద్యాన్ని వైసీపీ ప్రోత్సహిస్తుంది.