Y.S JAGAN MOHAN REDDY:ప్రజా ధనాన్ని వైసీపీ మరీ ఇంతలా వృధా చేస్తుందా!!

Arjun

Y.S JAGAN MOHAN REDDY:రాజకీయ నాయకులు ప్రజా ధనాన్ని ఉపయోగించి ప్రజలకు ఎంత మేలు చేస్తారో ఎవ్వరికి అర్ధం కాదు కానీ తమను తాము ప్రచారం చేసుకోవడానికి మాత్రం ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వాడుకుంటారు. ఈ విషయంలో వైసీపీ అన్ని పార్టీలకంటే ముందంజలో ఉంది. ప్రజా సంక్షేమ పథకాల కోసం ఎంత ఖర్చు చేస్తుందో దానికి సమానంగా అన్నట్టు ప్రచారానికి ఖర్చు చేస్తుంది.

YS JAGAN MOHAN REDDY

పథకం చిన్నదైనా, పెద్దదైనా ప్రచారం మాత్రం భారీగానే ఉండాలి. పథకం పేరు కంటే కూడా పెద్ద సైజులో జగన్ పేరును ముద్రిస్తూ ప్రచారం చేస్తూ వైసీపీ ప్రభుత్వం ప్రజల ధనాన్ని నాశనం చేస్తుంది. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ప్రచారానికి విచ్చలవిడిగా ప్రజా ధనాన్ని నాశనం చెయ్యమని చెప్పిన జగన్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే కూడా ఎక్కువ డబ్బులు ప్రచారానికి వాడుతున్నారు.

సొంత మీడియాకు ప్రజాధనం

టీడీపీ హయాంలో వాళ్ళకు అనుకూలంగా ఉన్న మీడియాకు ప్రజా ధనాన్ని పెద్ద మొత్తం ముట్టజెప్పింది. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కూడా తమకు అనుకూలంగా ఉన్న మీడియాకు ప్రజా ఇష్టమొచ్చినట్టు ఇచ్చేస్తున్నారు. ప్రచారానికి డబ్బును వృధా చెయ్యమని చెప్పిన జగన్ ఇప్పుడు ఇలా ప్రజా ధనాన్ని వృధా చెయ్యడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న విషయాలలోనే చెప్పిన మాటపై ఉందని జగన్ ను రానున్న రోజుల్లో ఎలా నమ్ముతారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఇప్పటికే వైసీపీ కావలసినంత వ్యతిరేకత ఉంది. అలాంటిది ఇప్పుడు ఈ ప్రజా ధన దుర్వినియోగంతో వైసీపీ మరింత ఇబ్బందుల్లో పడనుంది.

కాన్వాయ్ ల ఖర్చు అంతా!!

ప్రచార ఖర్చును పక్కన పెడితే వైసీపీ నాయకులు, వాళ్ళ అనుచరులు, ప్రభుత్వ అధికారుల రవాణా ఖర్చులు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని రవాణా అధికారులు వాపోతున్నారు. ఇప్పటికే రవాణా ఖర్చులు గడచిన మూడేళ్ళలో ఏకంగా 18 కోట్ల వరకూ బకాయిలు వున్నాయని రవాణా శాఖ వర్గాలు ప్రభుత్వానికి తెలిపాయి. సంక్షేమ పథకాలకు ఎంత ఖర్చు చేస్తున్నామో చెప్పే వైసీపీ ప్రభుత్వం ప్రచారానికి, ఇలా కాన్వాయ్ లకు కూడా ఎంత ఖర్చు అవుతుందో కూడా చెప్పాలి.

 

 

 

 

- Advertisement -