CHANDRABABU NAIDU:కడప జిల్లాలో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ప్రజల నుండి వస్తున్న ఆదరణను చూసి టీడీపీ నాయకులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఆదరణను చూసిన చంద్రబాబు నాయుడు వైసీపీపై తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావడాన్ని వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు సింబల్ గ టీడీపీ నాయకులు భావిస్తున్నారు.

ఇలా వస్తున్న వ్యతిరేకతను చూసి జగన్ భయపడుతున్నారని బాబు వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించే దమ్ములేదని, ఖచ్చితంగా ముందస్తుకు జగన్ వెళ్లనున్నారని బాబు వ్యాఖ్యనించారు.
జగన్ ముందస్తుకు వెళ్తారా!
అత్యధిక మెజారిటీతో గెలిచిన వైసీపీ ఇంత త్వరగా ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని టీడీపీ నాయకులు కూడా ఊహించలేదు. అలాంటిది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పాలన వల్ల ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత పెరిగింది. వ్యతిరేకత పెరిగిందని తెల్సుకున్న వైసీపీ నాయకులు దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది జరిగేలా కనిపించడం లేదు. ఈ విషయాన్నీ బట్టి చుస్తే వైసీపీ నిజంగానే ముందస్తుకు వెళ్లేలా కనిపిస్తుంది. ఎంత లాట్ అయితే అంత వ్యతిరేకత పెరుగుతుంది కాబట్టి ముందస్తుకు వెళ్తేనే వైసీపీకి మంచిదని రాజకీయ వైసీపీ నాయకులు కూడా భావిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
టీడీపీకి గెలిచే దమ్ముందా!
వైసీపీ ముందస్తుకు వెళ్తుందని వ్యాఖ్యలు చేస్తున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలిచే దమ్ముందా అని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎందుకంటే గత ఘోర పరాజయం చుసిన టీడీపీ ఇప్పుడు ప్రజల నుండి ఎన్నికల్లో గెలిచేంత మద్దతును పొందగలదా అని డౌట్. అలాగే వైసీపీకి ఎంత వ్యతిరేకత ఉన్నా కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీనే గెలుస్తుందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అలాగే ఎన్నికలకు టీడీపీ పొత్తు లేకుండా ఒంటరిగా రావాలని వైసీపీ నాయకులు టీడీపీకి సవాల్ విసురుతున్నారు . ఈ సవాల్ ను టీడీపీ స్వీకరిస్తుందో లేదా పొత్తుతోనే ఎన్నికలకు వెళ్తుందో వేచి చూడాలి.