Rahul Gandhi: కాంగ్రెస్ రాష్ట్రంలో ఉందని కూడా చాలామంది ప్రజలు మర్చిపోయారు. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు మొత్తం బీజేపీ, కేసీఆర్ మధ్యనే జరుగుతున్నాయి. కాంగ్రెస్ ను కనీసం పట్టించుకునే వారు రాష్ట్రంలో ఇప్పుడు లేరు. పార్టీలో ఉన్న కీలక నేతలు మెల్లగా బీజేపీ, తెరాస వైపు చూస్తున్నారు. రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో పార్టీ పగ్గాలు ఇస్తే ఎదో సాధిస్తాడని అంతా అనుకున్నారు కానీ రేవంత్ కూడా కాంగ్రెస్ ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పూర్తిగా విఫలమయ్యారు. కాంగ్రెస్ లోని చాలామంది నాయకులకే రేవంత్ రెడ్డి నచ్చడం లేదు. అలాంటి రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలను తనవైపు తిప్పుకుంటాడని కాంగ్రెస్ పెద్దలు అనుకోవడం మూర్ఖత్వం. అయితే ఇప్పుడు మొన్న ఒకసారి రాహుల్ గాంధీని రాష్ట్రానికి ఆహ్వానించి, వరంగల్ లో రేవంత్ రెడ్డి సభ పెట్టించారు.

అప్పుడు అక్కడ ప్రకటించిన రైతుల డిక్లరేషన్ రాష్ట్రంలో కొంత డిస్కషన్ కు దారి తీసింది. అయితే దాని తర్వాత కూడా పార్టీలో ఎలాంటి ఉత్సహం రాకపోవడం వల్ల రాహుల్ ను మరోసారి రాష్ట్రానికి పిలవడానికి రేవంత్ సిద్ధమయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సిరిసిల్లకు రాహుల్ రానున్నారా!!!
మొన్న వరంగల్ కు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు కాంగ్రెస్ లో ఎంతో కొంత ఉత్సహం కనిపించింది. అయితే అది ఎక్కువ కాలం ఉండలేదు. అయితే ఇప్పుడు మరోసారి రాహుల్ ను సిరిసిల్లకు పిలవడానికి రేవంత్ ప్లాన్ వేశారని సమాచారం. అయితే మొన్న నరేంద్ర మోడీ వచ్చినప్పుడు తెరాసా నాయకులు చేసిన హడావిడి బీజేపీ వాళ్ళ కంటే కూడా ఎక్కువగా ఉంది. అలాగే ఇప్పుడు ఒకవేళ రాహులా గాంధీ వస్తే కూడా తెరాస నాయకులు ఇలానే వ్యవహరిస్తారా లేదా పట్టించుకోకుండా వదిలేస్తారా చూడాలి. మొన్న మోడీ వచ్చి కేసీఆర్ ను పట్టించుకోకుండా వెళ్లినట్టు కేసీఆర్ కూడా రాహుల్ గాంధీ పట్టించుకోకుండా వదిలేస్తాడేమో చూడాలి. ఐన రాహుల్ వచ్చిన్నంత మాత్రాన కాంగ్రెస్ నాయకులు పెద్దగా చేసేదేమి లేదని కేసీఆర్ కు ఎప్పుడో అర్థమైంది.
నిరుద్యోగులు లక్ష్యమా!!
వరంగల్ కు వచ్చినప్పుడు రైతులను టార్గెట్ చేసిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు నిరుద్యోగ యువతను టార్గెట్ చేస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. తెలంగాణ సర్కార్‌పై రైతులతో పాటు నిరుద్యోగుల్లోనూ ఎక్కువ అసంతృప్తి ఉందన్న వాదన ఉంది. ఎనిమిదేళ్ల కాలం నియామకాలు పెద్దగా లేవు. ఇటీవలే ఎనభై వేల పోస్టుల భర్తీని ప్రకటించినా వాటి ప్రక్రియ నత్త నడకన సాగుతోంది. ఎన్నికల్లోపు ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో చెప్పడం కష్టంగా మారింది. దీంతో నిరుద్యోగులకు భారీ వరాలను నిరుద్యోగ డిక్లరేషన్‌లో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఈ డిక్లరేషన్ తో యువతలో కాంగ్రెస్ కు మద్దతు లభించే అవకాశం ఉంది. నిరుద్యోగ యువత కేసీఆర్ పై ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయం కాంగ్రెస్ కు ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయ్.