తెలంగాణలో ముందస్తు ఎన్నికల పర్వం మరల మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ముందస్తు ఎన్నికల వ్యూహాన్ని ప్రయోగించిన కెసీఆర్ ఈసారి కూడా ముదస్తూ ఎన్నికల వైపే మొగ్గు చూపుతున్నట్లు సంకేతాలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా జమిలీ ఎన్నికలకు ప్రాధాన్యం ఇస్తున్న నేపథ్యంలో కెసీఆర్ కూడా జమిలీ ఎన్నికలకు మద్దతు ఇచ్చి ముందస్తుగా వెళ్లనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇప్పటికే పథకాల అమలు, కొత్త పధకాలను ప్రవేశపెట్టడంపై కూడా దృష్టి సారించిన పరిస్థితి మనం చూస్తున్నాం. రైతు బీమా పథకం ఎలాగైతే ఉందో, చేనేత కార్మికులకు కూడా చేనేత బీమా సదుపాయం కల్పిస్తామని కెసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఇంకాస్త ముందుకెళ్ళి పథకాల అమలును ఆకస్మిక పర్యటనలతో పథకం అమలుతీరును పర్యవేక్షిస్తానని కూడా తెలిపిన విషయం తెలిసిందే. ఎందుకంటే ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ గా అనుకూల వాతావరణాన్ని కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో సంక్షేమంపై దృష్టి సారించినట్లు పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఒక వేల ముందస్తు ఎన్నికలు వస్తే కెసీఆర్ కు లాభం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఎమ్మెల్యేల పనితీరుపై ఫోకస్ చేయనున్న కెసీఆర్
ఎందుకంటే అంతటా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్న నేపథ్యంలో క్షేత్ర స్థాయి ప్రజలలో టీఆర్ఎస్ అంటే మంచి అభిప్రాయం కలిగి ఉన్న పరిస్థితులు ఉన్నవి కాబట్టి కెసీఆర్ ఎక్కువ క్షేత్ర స్థాయి పథకాలపైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఎమ్మెల్యేల పనితీరుపై కూడా కెసీఆర్ నివేదికలు తెప్పించుకుంటున్నట్లు తెలుస్తోంది. ఎవరైతే సరిగ్గా పనిచేయడం లేదనే పేరు విపిస్తుందో ఆ ఎమ్మెల్యేను పనితీరు మార్చుకోవాలని హెచ్చరించే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే ఎమ్మెల్యే పై కోపంతో కూడా ప్రజలు వేరే పార్టీకి ఓటు వేసే అవకాశం ఉంది. కాబట్టి అన్నీ రకాలుగా తనకు అనుకూల వాతావరణాన్ని కల్పించుకోవడానికి ఇప్పటికే కెసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంటిలేజెన్స్ రిపోర్టులు కూడా తెప్పించుకొని సవాల్ గా మారనున్న నియోజకవర్గాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టె అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.