Pawan: 2014 ఎన్నికల్లో టీపీడీకి జనసేన నాయకులు మద్దతు ఇచ్చారు. అప్పుడు రాష్ట్ర భవిష్యత్ కోసం మద్దతిచ్చామని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఆ తరువాత 2019 ఎన్నికల సమయంలో రెండు పార్టీలు విడిగా పోటీ చేశాయి. అప్పుడు ఒక సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ…ఒక వ్యాపారవేత్త పేరును ప్రస్తావిస్తూ, అతను లోకేష్ కు బినామని వ్యాఖ్యానించారు. అప్పుడు రెండు వేరు వేరుగా ఉన్నాయ్ కాబట్టి సరిపోయింది. కానీ ఇప్పుడు రెండు పార్టీలు వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పొత్తు పెట్టుకునేలా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ అప్పుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బినామీలు ఉన్న వ్యక్తులతో ఇప్పుడు పవన్ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని సోషల్ మీడియాలో పవన్ కు ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పుడు పొత్తు పెట్టుకున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ పట్టించుకోరని, అప్పుడేదో రాజకీయ విమర్శలు చేశారని టీడీపీ నేతలు చెప్తున్నారు.pawan kalyan

పవన్ కు లోకేష్ మద్దతు

పవన్ కళ్యాణ్ గతంలో లోకేష్ పై ఎన్ని విమర్శలు చేసినా కూడా లోకేష్ ఎప్పుడూ పవన్ పై విమర్శలు చెయ్యలేదు. పైగా ఇప్పుడు ఇంకా పొత్తును రెండు పార్టీలు ఆఫీసియల్ గా ప్రకటించలేదు కానీ అప్పుడే లోకేష్ పవన్ ను సపోర్ట్ చేస్తూ స్పీచ్ లు ఇస్తున్నారు. 2024 ఎన్నికల్లో రా్ట్రానికి చంద్రబాబును సీఎం చేయాలని పార్టీ కార్యకర్తలను..ప్రజలను కోరారు. అదే సమయంలో జీవో నెంబర్ 1 గురించి ప్రస్తావించారు. పవన్ కల్యాణ్ కూడా బయట అడుగు పెట్టకూడదంటున్నారని ఫైర్ అయ్యారు. వారాహి వాహనానికి ఏపీలో అనుమతి ఇవ్వమంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. వారాహి ఆగదు..యువగళమూ ఆగదు అని లోకేష్ స్పష్టం చేసారు. తన యాత్రతో పాటుగా పవన్ వారాహి యాత్రకు మద్దతుగా లోకేష్ మాట్లాడటం ఇప్పుడు రాజకీయంగా చర్చకు కారణమైంది. ఈ వ్యాఖ్యలను చూస్తుంటే ఇక పొత్తు కంఫర్మ్ అన్నట్టు కనిపిస్తుంది.

ఆఫిసిఅల్ ప్రకటన ఎప్పుడు!!

జనసేన-టీడీపీ పొత్తు ఆల్మోస్ట్ కంఫర్మ్ అయ్యింది. కానీ రెండు పార్టీలు మాత్రం ఇంకా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. అయితే జనసేన ఆల్రెడీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. రాష్ట్రంలో వైసీపీని ఓడించాలంటే ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ యొక్క మద్దతు కావాలి. కానీ బీజేపీ మాత్రం టీడీపీతో కలవడానికి ఇష్టపడటం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం టీడీపీ పొత్తు కోసం బీజేపీ పెద్దలను ఒప్పించే పనిలో రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒక్క వైసీపీని ఓడించడానికి ఇంత మంది కలిసి వస్తున్నప్పుడే జగన్ దమ్మెంటో తెలుస్తుందని వైసీపీ వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు.