Balakrishna: ఉన్నదానికంటే ఎక్కువగా ఊహించుకోవడం, దేవుళ్ళను గుడ్డిగా నమ్మి అదే నిజమనుకోవడం, పిచ్చిపట్టినట్టు ఇష్టమొచ్చినట్టు మాట్లాడటం, తరువాత వాటికి సమాధానాలు ఇచ్చుకోవడం బాలకృష్ణకు చాలా అలవాటు. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విషయంలో కూడా నందమూరి బాలకృష్ణ అదే తప్పు చేశాడు. ఏదో ఒక వైసీపీ ఫంక్షన్ లో తన మూవీ సాంగ్స్ ను ప్లే కాకుండా గోపిరెడ్డి అడ్డుకున్నాడని, అలా చెయ్యడం గోపిరెడ్డి మూర్ఖత్వమని, సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఏకం చేస్తుందని, వాటిలోకి రాజకీయాలు తీసుకొని రావొద్దని, తనకు ఆగ్రహం వస్తే, మూడో కన్ను తెరుస్తానని, తాను అజ్ఞాపిస్తే తన అభిమానులే గోపిరెడ్డి బుద్ధి చెప్తారన్న రేంజ్ లో మాట్లాడారు. అయితే ఇప్పుడు ఈ విషయంపై గోపిరెడ్డి ఇచ్చిన ఆన్సర్ కు బాలయ్యకు మతిపోతుంది.
బాలయ్య మనిషి కదా!!
రియాలిటీ తెలియకుండా, నిజమెంటో తెలుసుకునే ప్రయత్నమేమి చేయకుండా ఇస్తామవచ్చినట్టు మాట్లాడుతున్న బాలయ్య తన నోటిని అదుపులో పెట్టుకోవాలని గోపిరెడ్డి సలహా ఇచ్చారు. బాలయ్య మూడో కన్నుతెరుస్తానని అంటున్నాడని, మనుషులకైతే రెండు కళ్ళే ఉంటాయని, మరి మూడో కన్ను తెరుస్తానని చెప్తున్న బాలయ్య మనిషా కదా అన్నది టిడిపి వాళ్ళే చెప్పాలనే ఉద్ధేశ్యంతో మాట్లాడారు. ఎమ్మెల్యేగా, హీరోగా ఉన్నంత మాత్రాన బాలయ్యాను తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని, అయిన సాటి ఎమ్మెల్యే గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హితువు పలికారు.
నిజం తెలుసుకోవాలి
తాను ఈవెంట్ లో బాలయ్య పాటలను ప్లే కానివ్వడం లేదని ఎవరో ఒక తాగుబోతు చెప్పిన మాటలను పట్టుకొని, ఇలా ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సరిపోదని, అయినా ఆరోజు అక్కడ ఈవెంట్ లో జరిగినది వేరు ఇప్పుడు బాలకృష్ణ చెప్తున్నది వేరేని గోపిరెడ్డి చెప్పారు. అయినా బాలకృష్ణను తాను గాని, తన పార్టీ నాయకులు కానీ అంత సీరియస్ గా తీసుకునేంత పెద్ద నాయకుడు కాదని, ఆయన మూవీస్ ఆయన చేసుకుంటూ, ఊకే అలా ఎమ్మెల్యేగా ఉంటే ఆయనకే మంచిదని గోపిరెడ్డి హెచ్చరించారు. అయినా ఈ బాలకృష్ణ తన మూవీస్ లో ఇష్టమొచ్చినట్టు రాజకీయాలు మాట్లాడుతాడు, మళ్ళీ మూవీస్ అందరినీ ఏకం చేస్తాయని చెప్తాడు. ప్రోపగాండతో మూవీస్ చేసే బాలయ్య కూడా మూవీస్ గొప్పతనం గురించి చెప్తుంటే నవ్వొస్తుంది.