YS JAGAN MOHAN REDDY

Jagan: రాజకీయాల్లో వచ్చిన ఎన్నో ఇబ్బందులను, కష్టాలను దాటుకొని రాష్ట్రమంతా పాదయాత్ర చేసి, అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి, ఇవ్వాళా గవర్నర్ ముందు తానూ అధికారంలోకి వచ్చిన తరువాత చేసిన పనులు గురించి వివరించారు. తానూ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చానని, కులాలకు, మతాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలను అమలు చేశామని, గత ప్రభుత్వంలా తాము ప్రవర్తించడం లేదని, తాము అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తుందని, గత మూడు సంవత్సరాలుగా ఈజీ అఫ్ డూయింగ్ బిజినెస్ లో మూడవ స్థానంలో ఉన్నామని, ఆర్థికంగా కూడా రాష్ట్రం చాలా అభివృద్ధి సాధించిందని జగన్ తెలిపారు. అలాగే తన ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాల గురించి జగన్ చెప్పుకొచ్చారు.

ys jagan mohan reddy

పేదరిక నిర్ములన

డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలలు కన్న రాష్ట్రానికి నిర్మించడానికి పార్టీ పెట్టానని, అందుకోసమే రాష్ట్రంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీల ప్రయోజనాలే లక్ష్యంగా పాలన సాగిస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. నా నడక నేల మీదే..నా ప్రయాణం సామాన్యులు, పేద వర్గాలతోనే అని వెల్లడించారు. నా యుద్ధం.. పెత్తందార్లతోనే అన్నారు. నా లక్ష్యం.. పేదరికం నిర్మూలనే అని జగన్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న పేదరికాన్ని నిర్ములించడానికి తమ ప్రభుత్వం నవరత్నాలను అమలు చేస్తున్నామని, వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకోని వచ్చే వరకు వైసీపీ ప్రభుత్వానికి విశ్రాంతి లేదని జగన్ వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో తాము చేసిన మంచి పనులే తమకు విజయనిస్తాయని ధీమా కూడా వ్యక్తం చేశారు.

డిజిటల్ విద్య చేస్తాం

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత విద్య వ్యవస్థలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగు మీడియంలో ఉన్న విద్యను కంప్లీట్ గా ఇంగ్లీష్ మీడియంగా మార్చేశారు. గతంలో ప్రభుత్వ బడులు శిధిలావస్ధలో ఉండేవని, రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటుతో పోటీ పడే రోజులు వస్తాయన్నారు. వచ్చే రెండేళ్లలో 6వ తరగతి నుంచే డిజిటల్ క్లాస్ రూమ్ లు అమలు చేస్తామన్నారు. 8వ తరగతి నుంచి విద్యార్ధులకు బైజూస్ ట్యాబ్ లు ఇస్తున్నట్లు సీఎం జగన్ తెలిపారు. ట్యాబ్ లు ఇచ్చే విషయంలో ప్రైవేట్ స్కూళ్లు ప్రభుత్వ స్కూళ్లతో పోటీ పడాల్సి రావచ్చన్నారు. విద్యనే సమాజంలో ఉన్న రుగ్మతలను పోగొడుతుందని, అందుకే విద్యకు తమ ప్రభుత్వం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు.