YS Jagan Mohan Reddy: వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వైసీపీ నాయకులకు కూడా తెలిసిపోయింది. ఆ వ్యతిరేకతను తీసివేయడానికి వైసీపీ నేతలు చాల ప్రయత్నిస్తున్నారు. ఎలాగో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని వైసీపీ నిర్ణయించుకుంది కాబట్టి ఆ వ్యతిరేకతను చాలా తొందరగా పోగొట్టో, గడిచిన పాలనలో వైసీపీ చేసిన పనులకు ప్రజలకు చెప్పడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గడపగడపకు వైసీపీ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులకు ప్రజల దగ్గరకు వెళ్లాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొనని వైసీపీ నాయకులకు జగన్ మోహన్ రెడ్డి షాక్ఇచ్చారు.

తాను చెప్పిన ఆదేశాలను పాటించకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో జగన్ ఇప్పుడు ఆ నాయకులకు చూపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ షాక్ ను ప్రిపేర్ చేశారు.
టికెట్స్ ఇవ్వనున్న జగన్
ప్రభుత్వ పాలనలో ప్రజలకు చేసిన పనులను ప్రజలకు వివరించాలని, జగన్ చెప్పినప్పటికీ చాలా మంది నాయకులు ఆ కార్యక్రమంలో పాల్గొనలేదు. అలా గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోవారికి నెక్స్ట్ ఎన్నికల్లో టికెట్స్ ఇవ్వనని జగన్ చెప్పారు. ఈ జాబితాలో ఇద్దరు మాజీ మంత్రులు కూడా ఉన్నారు. అనిల్ కుమార్ యాదవ్, రామిరెడ్డి ప్రతాపరెడ్డి, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, వసంతకృష్ణ ప్రసాద్, ఆళ్ల నాని, శిల్పా చక్రపాణి రెడ్డిలు గడప గడపకూ కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని ఈ సారి వారికి టిక్కెట్ లేనట్లేనని జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వం కోసం పని చెయ్యని వారికి పార్టీ టికెట్ ఎందుకు ఇవ్వాలని జగన్ ఆ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. అయితే కార్యక్రమంలో ఎందుకు పాల్గొనలేదని చెప్పే ప్రయత్నం చేసినా కూడా జగన్ వినడం లేదని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.
ఈ నిర్ణయం సరైనదేనా!!
ఈ కఠిన నిర్ణయంపై వైసీపీ నాయకులకు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకోవడం మంచిది కాదని అంటుంటే ఇంకొంతమంది ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటేనే పార్టీ నాయకులకు క్రమశిక్షణ ఉంటుందని అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. అయితే అనిల్ లాంటి నాయకులకు చివరి నిమిషంలో అయినా టికెట్ ఇస్తారని పార్టీ పెద్దలు అంటున్నారు. అయితే ఇలా భయం పెడితేనే మిగితా నాయకులు క్రమశిక్షణగా పని చేస్తారు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే పార్టీ నాయకులు కస్టపడి పని చేసి, ప్రభుత్వం చేసిన పనులను ప్రజలకు చెప్పగలిగితే వ్యతిరేకత పోతుందేమో చూడాలి. అయితే వైసీపీ చెత్త పాలనను ఇలాంటి కార్యక్రమాలతో ఎలా మబ్బిపెడ్తారో చూడాలి.