YS JAGAN MOHAN REDDY: ఏపీలో ఉన్న ప్రతిపార్టీ చేస్తున్నది కుల రాజకీయాలు మాత్రమే. కుల రాజకీయాలు తప్పితే మరే రాజకీయాలకు ఏపీలో స్థానం లేదు. అగ్ర కులాలకు చెందిన వాళ్ళే రాజకీయాలను ఏలుతూ ఉంటారు. వేరే వర్గాల నుండి ఎవరైనా వస్తున్నారంటే వాళ్లను ఎక్కడికి అక్కడే తోక్కేస్తున్నారు. అయితే ఇప్పుడు బీసీలను ఆకట్టుకునే పనిలో ఉన్న వైసీపీ రాజసభ సీట్స్ లో 50 శాతం బీసీలకు ఇచ్చిన ఘనత తమకే దక్కుతుందని వైసీపీ నాయకులు గొప్పగా చెప్పుకుంటున్నారు.

అయితే ఇదే నాయకులకు రాష్ట్రంలో ఉన్న దళితలు, మైనారిటీ ప్రజలు మాత్రం అస్సలు కనిపించరు. వాళ్ళ ఓట్లు మాత్రం కావాలి కానీ వాళ్లకు ఎలాంటి పదవులు అధికారం మాత్రం ఇవ్వరు.
దళితులు, మైనార్టీలు కనిపించారా!
రెండు సీట్స్ బీసీలకు, రెండు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారికి ఇచ్చారు. ఇందులో దళితులను, మైనారిటీలను వైసీపీ ఎందుకు వదిలేసిందో అర్ధం కావడం లేదు. క్రిస్టియన్ దళితుల ఓట్లను పొందటానికి మాత్రం బైబిల్ పట్టుకొని తిరిగే జగన్ కు ఇలాంటి సందర్భంలో దళితులు ఎందుకు గుర్తుకు రావడం లేదో. దళితులకు జరుగుతున్న అన్యాయాలను దళితులకు తెలియకుండా చెయ్యడానికి జిల్లాలకు అంబెడ్కర్ పేర్లను పెడుతూ దళితులను మభ్యపెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. రాజకీయ పార్టీలు చేస్తున్న మోసాన్ని దళితులు ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది.
అంబెడ్కర్ పేరు పెడితే సరిపోతుందా!!
దళితులకు అధికారం ఇవ్వకుండా, వాళ్ళను రాజకీయంగా ఎదగనివ్వకుండా చేస్తున్న వైసీపీ ఇప్పుడు జిల్లాలకు అంబెడ్కర్ పేర్లను పెడుతూ దళితులను ఏదో ఉద్దరించినట్టు ఫీల్ అవుతుంది. దళితుల సమస్యలు తెలియాలంటే చట్టసభల్లో దళితులు ఉండాలి. అలా చట్ట సభలకు పంపే అవకాశం ఉన్నప్పటికీ కూడా వైసీపీ ఆ పని చెయ్యలేదు. వైసీపీ బీసీలకు ఏదో మంచి చేసినట్టు కలరింగ్ ఇస్తుంది కానీ ఆ పార్టీలో పెత్తనం అంతా రెడ్డి సామజిక వర్గానికి చెందిన వారిదే. ఇలా కుల రాజకీయాలు చేసే వాళ్లకు దళితుల ఓట్లు కావాలి అంతే.