YS JAGAN MOHAN REDDY:ముందు ప్రచారం ఆకాశమంత చెయ్యాలి, ఆ తరువాత పని మాత్రం అరకొరగా చేయాలన్నదే వైసీపీ నైజం. చేసే పని తక్కువ ఇచ్చే బిల్డ్ అప్ మాత్రం ఎక్కువ. 2019 ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఇదే సూత్రాన్ని పాటించారు. ఎన్నికల్లో గెలిస్తే చాలు ఆ పథకాలు అమలుకు సాధ్యమా కదా అన్న విషయాన్నీ కూడా పక్కన పెట్టేశారు.

అందుకే అధికారంలోకి వచ్చాక చాల పథకాలు అసలు అమలుకు సాధ్యం కాదని పక్కన పెట్టారు. అయినా ప్రజలు అడుగుతారా, ఎవరైనా అడిగితే వాళ్ళను ఎలా డీల్ చెయ్యాలో వైసీపీ నాయకులకు బాగా తెలుసు. మత్స్యకార భరోసా పథకం విషయంలో కూడా వైసీపీ సేమ్ ఫార్ములా ఫాలో అవుతుంది.
బిల్డ్ అప్ మాత్రమే ఉంటుంది
మొత్తంగా ఈ పథకం కింద ఒక లక్ష మందిని ఎంపిక చేశారు. ఈ లక్ష మందికి ఇచ్చే నగదు కంటే కూడా ఈ కార్యక్రమ ప్రచారం కోసం, జగన్ రాక కోసం చేసిన ఏర్పాట్ల ఖర్చే ఎక్కువగా ఉందట. పత్రికల్లో, టీవీల్లో, డిజిటల్ మీడియాలో, జగన్ కోసం చేసిన ఏర్పాట్ల కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అయ్యాయి. పైగా ఈ మధ్య జగన్ ఎక్కడికి వెళ్లినా కూడా పరదాలు కట్టడం వల్ల ఖర్చులు ఇంకా పెరిగే ఉంటాయి. ఇలా ప్రకటనలపై ప్రజా ధనాన్ని తగలేసే బదులు ప్రజా సంక్షేమం కోసం కూడా వాడొచ్చు. కానీ అలాంటి పని వైసీపీ చెయ్యదు. ప్రశ్నించే వాళ్ళు లేరని ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.
ఇష్టమొచ్చిన షరతులు
వైసీపీ పథకాలు ఎలా ఇవ్వాలని షరతులు పెడుతుందో లేక ఎలా ఇవ్వకూడదని షరతులు పెడుతుందో అర్ధం కావడం లేదు. వేరే పథకాల నుండి లబ్ది పొందుతున్న వారిని ఈ పథకం నుండి పక్కన పెడుతున్నారు. అలాగే ఇంట్లో ఇంతమంది చేపల వేటకు వెళ్లినా కూడా ఒక్కరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ఇష్టమొచ్చిన షరతులు వైసీపీ పెడ్తుంది. ఇచ్చే ఉద్దేశం లేనప్పుడు ఇవ్వకుండా ఉండటమే బెటర్. ఇలా ఇష్టమొచ్చిన షరతులు పెట్టడం సరికాదని ప్రజలు చర్చించుకుంటున్నారు.