NARA LOKESH
NARA LOKESH

Lokesh: రాష్ట్రంలో ఉన్న యువతకు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను చెప్తూ, వాళ్ళను ఏకం చేసి, వచ్చే ఎన్నికల్లో గెలవడానికే ఈ యువగళం అనే పాదయాత్రని టీడీపీ నాయకులు చెప్తున్నారు. కానీ లోకేష్ కు రాష్ట్ర రాజకీయాలపై సరైన అవగాహన లేకపోవడం వల్ల లోకేష్ అప్పుడే తప్పులు మాట్లాడుతూ వైసీపీ వాళ్లకు దొరికిపోయాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో ఏర్పాటైన శ్రీసిటీ గురించి లోకేష్ మాట్లాడుతూ, దాన్ని ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడుదేనని వెల్లడించారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి చేసిన మంచి పనులను కూడా లోకేష్ టీడీపీ ఖాతాలో వేస్తున్నాడని, ఇలా అబద్ధాలు చెప్పే అధికారంలోకి రావడానికి టీడీపీ ప్రయత్నిస్తుందని వైసీపీ నాయకుడు పేర్ని నాని తెలిపారు. టీడీపీ గతంలో కూడా ఇలా అబద్ధాలు చెప్పడం వల్లే ప్రజలు ఓడించారని, అయినా కూడా టీడీపీ నాయకులకు బుద్ధి రావడం లేదని వ్యాఖ్యానించారు. సంక్రాంతి ముందు వచ్చే పిట్టల దొరలాంటి వాడని పేర్ని నాని వెల్లడించారు.

పిట్టల దొర లోకేష్

సంక్రాంతి ముందు జనరల్ గా పిట్టల దొర వస్తాడు కానీ ఇప్పుడు ఏపీలో సంక్రాంతి తరువాత లోకేష్ అనే పిట్టల దొర వచ్చాడని పేర్ని నాని లోకేష్ పై కామెడీ చేశారు. 14 సంవత్సరాలు సీఎంగా విధులు నిర్వహించిన చంద్రబాబు నాయుడుకు లోకేష్ అనే పిట్టల దొర పుట్టాడని తెలిపారు. టీడీపీ నాయకులకు అంత దమ్ముంటే పొత్తులు లేకుండా ఎన్నికలకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించాడు. ఈ పాదయాత్రలో లోకేష్ ఎంతసేపు వైసీపీపై ఏడవడం తప్పా గతంలో టీడీపీ చేసిన పనుల గురించి ఎందుకు చెప్పడం లేదని, చెప్పడానికి టీడీపీ చేసిన మంచి పనులు కూడా లేవని పేర్ని నాని వెల్లడించారు. ఐన ప్రజలకు ఎన్నో పథకాలు అందించిన జగన్ ను లోకేష్ ఏమని ప్రశ్నిస్తాడని తెలిపారు. ప్రజలకు

పోలీసులపై గౌరవం లేదా!!

టీడీపీ నాయకుడు అచ్చెన్నాయుడు పోలీసులపై చాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. వాటిపై కూడా పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం టీడీపీ నాయకులు అమిత్ షా వద్దకు, కోర్టులకు వెళ్లి గన్‌మేన్లను పెంచుకుంటారని, రక్షణగా పోలీసులు కావాలని డిమాండ్ చేస్తారని, ఇప్పుడు 500 మంది పోలీసులు ఎందుకు వచ్చారని నిలదీస్తోన్నారని తప్పుపట్టారు. ప్రజల కోసం ఎంతో కష్టపడుతున్న పోలీసులపై ఇలా మాట్లాడిన వాళ్ళు ప్రజల కోసం ఏమి చేస్తారో అర్థమైతుందని తెలిపారు. తమ విధులను నిర్వర్తిస్తున్న వాళ్ళను కూడా టీడీపీ నాయకులు ఇలా కించపరచడం తగదని ఆగ్రహం వ్యక్తం చేశారు.