YCP: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీలో దాదాపు 99% నెరవేర్చామని వైసీపీ నాయకులు నిత్యం చెప్తూనే ఉన్నారు. అయితే అదంతా వాస్తవం కాదని, వైసీపీ నాయకులను జనాలను మోసం చెయ్యడానికి ఇలాంటి తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని ప్రతిపక్షాల నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రం అధోగతి పాలైందని ప్రతిపక్షాల నాయకులు అంటున్నారు. అయితే ప్రతిపక్షాలు వైసీపీ ప్రభుత్వం చేస్తున్న మార్పును చూసి తట్టుకోలేకపోతున్నారని పెనమలూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి వ్యాఖ్యానించారు. టీడీపీ ప్రభుత్వం జన్మభూమి పేరుతో చేసిన మోసాలను ప్రజలు ఇంకా మర్చిపోలేదని వ్యాఖ్యానించారు. అలాగే విద్య కోసం వైసీపీ ప్రభుత్వం రూ. 30000 కోట్ల రూపాయలను ఖర్చు చేశారని వెల్లడించారు.

విద్య కోసం 30000 వేల కోట్లా!!
విద్యపై పెట్టుబడి పెట్టడం అనేది విప్లవాత్మక మార్పునకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు- విద్య ప్రభుత్వ బాధ్యత కాదని తప్పించుకోగా..- దాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద గడపలకు చేర్చారని అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తెచ్చిందని, మానవ వనరుల అభివృద్ది జరగడం వల్ల దేశానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సిద్ధాంతాన్ని నమ్మిన ఏకైక సీఎం జగన్ అని చెప్పారు. చంద్రబాబు, జగన్ నిర్దేశించుకున్న లక్ష్యాల్లో ఎంతో తేడా ఉందని, దీన్ని ప్రజలు గమనించాలని కోరారు. వైసీపీ ప్రభుత్వం విదేశీ విద్యా దీవెన ద్వారా 213 మంది విద్యార్థులకు 19.95 కోట్ల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసిందని పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడుది విభజించి పాలించు విధానమని పార్థసారథి విమర్శించారు.
ప్రభుత్వ హాస్టల్స్ చూశారా!!
వైసీపీ ప్రభుత్వం విద్య కోసం 30000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని వైసీపీ నాయకులు చెప్తున్నారు కానీ రోజుకో ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యార్థులు అక్కడ పెట్టిన తిండి తిని అనారోగ్యం పాలవుతున్నారు. ఈ విషయం మాత్రం వైసీపీ నాయకులకు పట్టదు. ప్రభుత్వ హాస్టల్స్ లో ఉన్నపేద విద్యార్థుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. ఈ హాస్టల్స్ లో ఉన్న విద్యార్థులకు వచ్చిన కష్టాల గురించి ఏ నాయకుడు మాట్లాడడు. అధికార పక్షనాయకులకు ఇవన్నీ పట్టించుకోరు, ప్రతిపక్షాల నాయకులకు అధికార పక్ష నాయకులను తిట్టడం తప్పా మిగితావేవీ పట్టవు. ప్రభుత్వం అన్ని వేల కోట్ల ఎక్కడ ఖర్చు చేసిందో, ఎవరి కోసం ఖర్చు చేసిందో తెలియదు.