Ysrcp:ఈ నాయకులను నమ్ముకుంటే జగన్ పార్టీని మూసేసుకోవలసిందే!!

Arjun

Ysrcp: 2019 సాధించిన విజయం చరిత్రలో నిలిచిపోతుంది. విచ్చలవిడిగా పథకాలను ప్రకటించి, ఒక్క అవకాశం అంటూ మొత్తం 175 సీట్స్ కు గాను 151 గెలిచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు.

ysrcp leaders only ruining ysrcp image

అయితే ఇప్పుడు ఆ గెలుపును వైసీపీ నాయకులే మళ్ళీ తుంగలో తొక్కడానికి సిద్ధమయ్యారు. కష్టపడి అధికారంలోకి వచ్చిన వైసీపీ ఆ పంథాను నిలబెట్టుకోవడానికి నానా తంటాలు పడుతుంది.

వైసీపీని ముంచేస్తున్నారు

అధికారంలోకి వచ్చిన వైసీపీ నాయకులు, గర్వంతో విర్రవీగుతూ ప్రవర్తిస్తున్నారు. వైసీపీ నాయకుల మెడకు చుట్టుకోని అక్రమాలు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. ప్రశ్నా పత్రాల లీకేజి నుండి మొదలుపెడితే
తమ పార్టీ నేతలనే చంపుకునే వరకు వైసీపీ నాయకులు పార్టీని దిగజారుస్తున్నారు. అలాగే మంత్రుల స్థానం ఉన్నవారు ప్రజా సమస్యలమీద ఎలాంటి అవగాహనా లేకుండా మీడియా ముందు మాట్లాడుతున్నారు. మహిళపై అత్యాచారాలు జరుగుతుంటే వాటికి మహిళలే కారణమని చెప్తూ వైసీపీ ఖ్యాతిని గంగలో కలుపుతున్నారు.

జగన్ సరిదిద్దుతాడా!!

నాయకులు ప్రవర్తన పార్టీకి ఎలాంటి నష్టం కలిగిస్తుందో జగన్ పసికట్టాడో లేదో కానీ ప్రజలకు మాత్రం పార్టీపై వ్యతిరేకత మొదలు అయ్యింది. పార్టీకి నష్టం కలిగిస్తున్న నాయకులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకుంటారోనని రాజకీయ వర్గాలు ఎదురు చూస్తున్నారు. జగన్ తొందరగా తెలుకొని నిర్ణయం తీసుకోకపోతే రానునన్ ఎన్నికల్లో ఓటమి తప్పదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

- Advertisement -