Ys Jagan Mohan Reddy: తానూ అధికారంలోకి వస్తే మద్యాన్ని కేవలం ఫైవ్ స్టార్ హోటల్స్ కు మాత్రమే పరిమితి చేసి ఎన్నికలకు వెళ్తానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. అయితే ఎప్పటిలాగే చెప్పిన మాట లేదా ఇచ్చిన మాట తప్పడం జగన్ కు అలవాటే కనుక ఈ విషయంలో కూడా జగన్ ప్రజలను, ఈ విషయాన్ని నమ్మి ఓట్లు వేసిన జనాన్ని వెర్రి వాళ్ళను చేశారు. అలాగే ఇప్పుడు ఇప్పుడు మధ్యనే మరింత అందుబాటులోకి తేవడానికి జగన్ సిద్ధమయ్యారు. ఇప్పుడు మళ్ళీ మూడేళ్లకు బార్ లైసెన్స్‌లు ఇస్తామని గెజిట్ రిలీజ్ చేశారు. కేవలం మద్యంపై ఆధారపడిన ప్రభుత్వం దాన్నుండి మరింత గుంజుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది.

అయినా ఇంకో రెండేళ్లలో జగన్ ప్రభుత్వం యొక్క గడువు ముగుస్తుంది అలాంటప్పుడు మూడేళ్ళ లైసెన్స్ లు ఎలా ఇస్తారని రాజకీయ వర్గాలు చర్చించుకున్నారు.
బార్ కు అప్లికేషన్
యువతకు జాబ్ కు అప్లై చేసుకునే అవకాశాన్ని జగన్ ప్రభుత్వం ఇవ్వడం లేదు కానీ బార్ షాప్ పెట్టుకోవడానికి మాత్రం అప్లికేషన్స్ ఓపెన్ చేస్తుంది. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలనుకుంటే ముందుగా రూ. ఐదు లక్షలు పెట్టి అప్లికేషన్ కొనుక్కోవాలి. అలాగే 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే అప్లికేషన్ ఖరీదు రూ. ఏడున్నర లక్షలు, 5 లక్షలు అంత కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాల్లో బార్ పెట్టుకోవాలంటే రూ. పది లక్షల అప్లికేషన్ పీజు కట్టాల్సి ఉంటుంది. తర్వాత బార్ల కోసం వేలం పాట నిర్వహిస్తారు. వేలంలో దక్కినా దక్కకపోయినా బార్ ఈ డబ్బు మాత్రం తిరిగి ఇవ్వరు. వేలంలో ఎంతకు దక్కించుకుంటే అంత కట్టాల్సిందే. ఏడాదికి పది శాతం పెంచాలి.
త్రి స్టార్ హోటల్స్
మద్యం లభించే ఒక్కో చోటుకు ఒక్కో రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అలాగే ఇప్పుడు త్రి స్టార్ హోటల్స్ కు ప్రత్యేక అనుమతులు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. రూ. ఐదు లక్షల రిజిస్ట్రేషన్ ఫీజు బార్లు పెట్టాలనుకునే అన్ని త్రీ స్టార్ హోటల్స్ కట్టాలి. ఆ పైన జనాభాను బట్టి రూ. 15 నుంచి 50 లక్షలు ఏడాదికోసారి చెల్లించాలి. మొత్తంగా 840 బార్లకు అనుమతి ఇస్తారు. ఇలా మద్యాన్ని ఇష్టమొచ్చినట్టు అమ్మే జగన్ ప్రజలకు అమలుకు సాధ్యం కానీ హామీలు ఎందుకు ఇస్తాడో అర్ధం కాదు. ప్రజలను వెర్రి వాళ్ళను చెయ్యడం తప్ప మరేమి ఉండడు. జగన్ ప్రభుత్వమే ఎవరు అధికారంలోకి వచ్చినా కూడా మద్యాన్ని నిషేధించడం లేదా అదుపు చెయ్యడం సాధ్యమయ్యే పనే కాదు.