Bubbly Bouncer : రిలీజ్ డేట్: సెప్టెంబర్ 23, 2022
నటినటులు: తమన్నా, అభిషేక్ బజాజ్, ప్రియంసాహా, సౌరబ్ శుక్లా, సుప్రియ శుక్లా, సాహిల్ వైడ్ తదితరులు.
డైరెక్టర్: మధుర్ భండార్కర్
నిర్మాతలు: వినీత్ జైన్, అమృతా పాండే
మ్యూజిక్ డైరెక్టర్ : తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా
సినిమాటోగ్రఫీ: హిమ్మన్ ధమిజా
డైరెక్టర్ మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా బబ్లీ బౌన్సర్. ఈ సినిమాలో ప్రధాన పాత్రలో మిల్క్ బ్యూటీ తమన్నా నటించినది. కామెడీ డ్రామా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు వినీత్ జైన్, అమృత పాండే నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టారు. తనిష్క్ బగ్చి, కరణ్ మల్హోత్రా మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా ఈరోజు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో విడుదల కాగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం. అంతేకాకుండా తమన్నా కు ఎటువంటి సక్సెస్ ను అందించిందో చూద్దాం.
కథ: కథ విషయానికి వస్తే ఇందులో తమన్నా పాత్ర పేరు బబ్లీ. బబ్లీ ఢిల్లీకి సమీపంలో పహిల్వాన్లకు ప్రసిద్ధి చెందిన ఫతేపూర్ లో ఉంటుంది. ఇక ఆ గ్రామంలో నివసించే కుర్రాళ్ళు అందరూ ఢిల్లీకి వెళ్లి బౌన్సర్లుగా పని చేస్తూ ఉంటారు. అందులో ఒక కుర్రాడు కుకు (సాహిల్ వైడ్) బబ్లీని ఇష్టపడతాడు. ఇక ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసి తన తల్లిదండ్రులతో తన ఇంటికి వెళ్తారు. ఇక అప్పటికే వచ్చిన సంబంధాలన్నీ చెడగొడుతున్న బబ్లీ కుకు రావటంతో అతనితో పెళ్లికి ఒప్పుకోవడానికి ఒప్పుకుంటుంది. కానీ ఒక కండిషన్ పెడుతుంది. ఒక సంవత్సరం పాటు తను కూడా ఢిల్లీలో ఉద్యోగం చేస్తానంటుంది. అలా కుకు పని చేసే నైట్ క్లబ్ లో బబ్లీకి లేడీ బాన్సర్ ఉద్యోగం వస్తుంది. ఆ తర్వాత బబ్లీ ఉద్యోగంలో చేరాక ఏం జరుగుతుంది.. ఇంతకు అభిషేక్ బజాజ్ తనకు ఎప్పుడు ఎదురవుతారు.. తనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సన్మానం చేస్తారు అనేది మిగిలిన కథలోనిది.
ప్లస్ పాయింట్స్: తమన్నా తన పాత్రతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. ఎమోషన్స్ అంతంత మాత్రమే ఉంది.
Bubbly Bouncer :
మైనస్ పాయింట్స్: రొటీన్ కథ లాగా అనిపించింది. కామెడీ అంతగా వర్కౌట్ కాలేదు అని చెప్పవచ్చు. కొన్ని పాత్రలు కూడా ఎందుకో అంత సెట్ కాలేదు అనిపించాయి.
సాంకేతిక విభాగం: చాలా వరకు డైరెక్టర్ ఈ సినిమాను
రొటీన్ గా తీసినట్టు అనిపించింది. మ్యూజిక్ పర్వాలేదు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. మిగిలిన నిర్మాణ విలువలు తమ పనులకు పూర్తి న్యాయం చేశాయి.
చివరి మాట: చివరగా చెప్పాల్సిందేంటంటే.. రొటీన్ కథ అయినా కూడా అంతగా నష్టమేమీ లేదు అన్నట్లుగా ఉంది. కామెడీ మాత్రం పెద్దగా పండలేదు అని చెప్పవచ్చు. ఇక ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలా ఉంది అని చెప్పవచ్చు.
రేటింగ్: 2.5/5