Major Review రిలీజ్ డేట్: జూన్ 3, 2022
నటినటులు: అడవి శేష్, సాయి మంజ్రేకర్, శోభితా ధూళిపాళ, ప్రకాష్ రాజ్, మురళి శర్మ, రేవతి తదితరులు
డైరెక్టర్: శశికిరణ్ తిక్క
నిర్మాతలు: సోనీ పిక్చర్ ఫిలిమ్స్ ఇండియా, ఏఎంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ సినిమాలు
మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ చరణ్ పాకాల
సినిమాటోగ్రఫీ: వంశీ పచ్చిపులుసు
టాలీవుడ్ హీరో అడవి శేష్ నటించిన ఈ మేజర్ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందింది. ఈ సినిమా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. భారీ అంచనాలతో ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు రాగా ప్రేక్షకులను ఎలా మెప్పించిందో చూద్దాం.
కథ: కథ విషయానికి వస్తే.. సందీప్ ఉన్నికృష్ణన్ (అడవి శేష్) మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతనికి బాల్యం నుంచి నేవీలో చేరాలని కోరిక. కానీ అనుకోని పరిస్థితుల్లో ఆర్మీలో చేరుతాడు. అప్పుడే అతడికి ఇషా (సాయి మంజ్రేకర్) పరిచయం ఏర్పడి ప్రేమగా మారుతుంది. తర్వాత పెళ్లి కూడా జరుగుతుంది. ఇక సందీప్ ఆ సమయంలో ఆర్మీలో ఎన్ఎస్జీ కమెండో టీంకు టైనర్ గా అడుగుతాడు. ఆ తర్వాత కొన్ని సమస్యలు రావడంతో తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇక అతడు ముంబై కి చేరుకోగానే ఉగ్రదాడి ఎదురవుతుంది. దీంతో సందీప్ దానిని ఎలా ఆపుతాడు.. అసలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు.. తాజ్ హోటల్ లో దాగిన ఉగ్రవాదులను పట్టుకుంటాడు అనేది మిగిలిన కథ లోనిది.
ప్లస్ పాయింట్స్: ఈ సినిమాకు దర్శకుడు శశికిరణ్ ప్రాణం పోసాడు అని చెప్పవచ్చు. కేవలం కథనే కాకుండా పాత్రకు తగ్గట్టు నటీనటులను కూడా ఎన్నుకున్నాడు. ఇక కాస్ట్యూమ్స్, మ్యూజిక్, టెక్నికల్ అంశాలు అన్నీ ఆకట్టుకున్నాయి. ఇక అడవి శేష్ కూడా తన నటనతో స్థాయికి దూసుకెళ్ళాడు అని చెప్పవచ్చు. ప్రకాష్ రాజ్ పాత్ర మాత్రం బాగా ఆకట్టుకుంది. ఆయన డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ షకీలా కు బాగా కనెక్ట్ అయ్యాయి. హీరోయిన్ సాయి మంజ్రేకర్ కూడా తన పాత్రలో లీనం అయ్యింది.
మైనస్ పాయింట్స్: ఇక ఫస్టాఫ్ లో సినిమా కాస్త స్లో గా ఉన్నట్లు అనిపించింది. అంతే కాకుండా ఇందులో ఉన్నికృష్ణన్ లక్ష్యాన్ని ఇంకాస్త రూపుదిద్దుతే బాగుండేది. హీరో హీరోయిన్ మధ్య ఉన్న బంధాన్ని ఇంకాస్త చేయాల్సి ఉండేది. ముఖ్యంగా ఇందులో కొన్ని అంశాలు మిస్ అయినట్లు అనిపించింది.
సాంకేతిక విభాగం: టెక్నికల్ పరంగా చూసినట్లయితే.. దర్శకుడు మంచి కథను చూపించాడు. ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే డైలాగులను అందించారు. సినిమా కోసం భారీ పెట్టుబడి పెట్టారు నిర్మాతలు. ముఖ్యంగా ప్రొడక్షన్ డిజైన్లు, సెట్ లు భారీగా ఉన్నాయి. శ్రీ చరణ్ అందించిన సంగీతం మాత్రం హైలెట్గా మారింది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.
చివరి మాట: ఒక గొప్ప వ్యక్తి జీవిత ఆధారం లో వచ్చిన ఈ సినిమా చూడాల్సిన సినిమానే. ఎక్కడ కూడా ఈ సినిమాపై అంచనాలు తగ్గలేదు అని చెప్పాలి. ప్రతి సన్నివేశం బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి.