Priyamani: టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి. ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి. అంతేకాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించింది. కెరీర్ మొదట్లో తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ ను పరిచయం చేసింది. ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండగా మళ్లీ రీ ఎంట్రీ తో బాగా బిజీ గా మారింది. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
వెండి తెరపై కాకుండా బుల్లితెర లో కూడా అడుగు పెట్టింది. ఓ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది ప్రియమణి. ఇక ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా నటించగా తన పాత్రకు మంచి సక్సెస్ అందుకుంది. ఇక లేటు వయసులో కూడా తన అందాలతో బాగా ఆకట్టుకుంటుంది. గతంలో ప్రియమణికి కాస్త శరీర బరువులో మార్పులు రావడంతో బొద్దుగా కనిపించింది.
కానీ ఇప్పుడు సన్నగా తన అందాలతో పిచ్చెక్కిస్తుంది. ఇక ప్రియమణి ఇప్పుడు తన వయసుకు తగ్గ పాత్రలో నటిస్తుంది కానీ ఒకప్పుడు హీరోయిన్ గా ఉన్నప్పుడు మాత్రం మంచి క్రేజ్ సంపాదించుకుంది. చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది. సినిమాలలో గ్లామర్ పాత్రలను కూడా పోషించింది.
ఇక ఈమె నటించిన గోలీమార్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో గోపీచంద్ సరసన నటించింది ప్రియమణి. ఇక ప్రియమణి ఈ సినిమాలో కూడా గ్లామర్ గానే కనిపించింది. అంతేకాకుండా బీచ్ లో తెరకెక్కిన రొమాంటిక్ సాంగ్ లో కూడా తన అందాలతో మత్తెక్కించింది.
Priyamani: ప్రియమణితో అలాంటి సన్నివేశం చేయడానికి ఇబ్బంది పడ్డ స్టార్ హీరో..
అయితే గోపీచంద్ అలా బీచ్ లో హీరోయిన్స్ తో రొమాన్స్ చేసే పాటలు నటించలేదట. దాంతో ఆ సమయంలో ప్రియమణిని ముద్దు పెట్టుకునే సన్నివేశంలో గోపీచంద్ చాలా ఇబ్బంది పడ్డాడట. ప్రియమణి ఈజీగా చేసిన కూడా గోపీచంద్ మాత్రం కౌగిలించుకునే సన్నివేశాలు, సిగ్గుపడి టేక్స్ ఎక్కువగా తీసుకున్నాడట. పూరి ఏంటి గోపి అని అడిగితే.. ప్రియమణి తో రొమాన్స్ చేయాలి అంటే ఏదోలా ఉంది సార్ అని అన్నారట. ఆ తర్వాత ఎలాగో అలా ఆ పాటను కంప్లీట్ చేశారట. అదే గోపీచంద్ స్థానంలో మరెవరైనా ఉంటే అలాంటి సన్నివేశాలు సులువుగా చేసేవారు. కానీ గోపిచంద్ ఇష్టంగా చేయక అలాంటి గోల్డెన్ ఛాన్స్ ను వదులుకున్నాడని అర్థమవుతుంది.