Mohammed Shami: సాధారణంగా వివాహం చేసుకొని భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత భార్యకు భర్త భరణం ఇవ్వాల్సిందే.ఇలా ఇప్పటికే ఎంతోమంది విడాకులు తీసుకున్నటువంటి వారు తమ భార్యకు భరణం చెల్లిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే టీమిండియా స్టార్ పెసర్ మహమ్మద్ షమీకి సైతం కలకత్తా కోర్టు షాక్ ఇచ్చింది. మహమ్మద్ షమీ హసీజ్ జహాన్ కి 2014 లో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది అయితే కొన్ని సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం సవ్యంగా సాగినప్పటికీ 2018లో హసీజ్ క్రికెటర్ మహమ్మద్ షమీపై గృహహింస కేసును నమోదు చేశారు.
2018లో కలకత్తాలోని జాదవ్ పూర్ పోలీస్ స్టేషన్లో ఆశ్రయించి ఈమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో మహమ్మద్ షమీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయింది. అదేవిధంగా ఈమె తనకు భరణం కింద ప్రతినెల 10 లక్షల రూపాయలు మహమ్మద్ షమీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇందులో ఏడు లక్షలు తనకి ఖర్చులకు గాను మిగిలిన మూడు లక్షలు తన కుమార్తె ఖర్చులకు గాని ఈమె నెలకు 10 లక్షల రూపాయలు చొప్పున భరణం డిమాండ్ చేశారు. ఇలా వీరి వాదనలను విన్నటువంటి కోర్టు సోమవారం ఈ కేసు పట్ల తమ నిర్ణయాన్ని తెలియజేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Mohammed Shami: కోర్టు తీర్పుతో అసంతృప్తి వ్యక్తం చేసిన హసీజ్..
ఈ సందర్భంగా కలకత్తా కోర్టు ఈ విషయం పై ఉత్తర్వులు జారీ చేస్తూ మహమ్మద్ షమీ తన మాజీ భార్యకు భరణం ఇవ్వాలని షాక్ ఇచ్చారు. అయితే ప్రతినెల 1.30 లక్షల రూపాయల భరణం చెల్లించాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో 50వేల రూపాయల మాజీ భార్య ఖర్చుల నిమిత్తం కాగా మిగిలిన 80 వేల రూపాయలు తన కుమార్తె ఖర్చల కోసం, పోషణ కోసం ఇవ్వాలని కోర్టు తన తీర్పును వెల్లడించింది. ఈ విధంగా కోర్టు ఇచ్చిన తీర్పుకి హసీజ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ…ఈ తీర్పును ఆమె ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేయనున్నట్లు తెలుస్తోంది.