Gold Price: బంగారం వెండి ధరలు మళ్లీ ఆకాశం వైపు పరుగులు పెడుతున్నాయి. మొన్న అరవై వేలు దాటిన బంగారం ధర నిన్న కాస్త శాంతించింది అనేటప్పటికీ మళ్లీ ధర పెరిగి పసిడి ప్రియులకు షాకిచ్చింది. ఫెడ్ వడ్డీరేట్లు పెరిగితే సాధారణంగా బంగారం వెండి ధరలు పడిపోతాయి. అయితే ఇప్పుడు ఫెడ్ వడ్డీ రేట్లు పెంపుని నిలిపివేసే యోచనలో ఉన్నట్టు వార్తలు రావటంతో డాలర్ రేట్ పడిపోయింది. దాని ప్రభావం బంగారు వెండి ధరల మీద పడింది. […]