Amazon CEO : కోవిడ్ వల్ల ఉద్యోగులందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇచ్చాయి పలు కంపెనీలు. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ను ఇచ్చాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటి దగ్గర్నుంచే వర్క్ చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ నే ఇంకా కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ప్రొడక్టివిటీ పెరిగిందని, కంపెనీలు కూడా లాభాల బాట పట్టిందని కంపెనీలు వెల్లడించాయి.
వర్క్ ఫ్రమ్ ఆఫీసు కంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బెటర్ ఆప్షన్ అని కంపెనీలు, ఉద్యోగులు కూడా నమ్మారు. కానీ.. వర్క్ ఫ్రమ్ హోమ్ వేస్ట్.. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితేనే బెటర్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేస్తేనే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతాయి అంటూ టాప్ ఎంఎన్సీ కంపెనీ సీఈవో ఆండీ జస్సీ చెప్పుకొచ్చారు. బెస్ట్ రిజల్ట్స్ రావాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ బెస్ట్ ఆప్షన్ కాదంటూ ఆయన స్పష్టం చేశారు.
Amazon CEO : హైబ్రిడ్ విధానాన్ని తీసుకొచ్చిన అమెజాన్
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ సీజన్ ప్రస్తుతం నడుస్తోంది. లేఆఫ్స్ ఎక్కువ అవడానికి ప్రధాన కారణాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు. వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా నూటికి నూరు శాతం అనుకున్న రిజల్ట్స్ సాధించలేమని.. అమెజాన్ కంపెనీ కూడా తెలుసుకుంది.
అందుకే తమ ఉద్యోగులను కనీసం వారానికి మూడు రోజులు అయినా ఆఫీసుకు రావాలని అమెజాన్ తెలిపింది. మే 2023 నుంచి కనీసం మూడు రోజులు ఆఫీసులో వర్క్ చేయాల్సిందే. అలా అయితేనే కంపెనీకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని, కొత్త ఆవిష్కరణలకు ఆజ్యం పోయొచ్చని అమెజాన్ సీఈవో నమ్ముతున్నారు. ఫేస్ బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ కూడా అదే విషయం తన ఉద్యోగులకు చెప్పుకొచ్చారు.
లేఆఫ్స్ లో భాగంగా అమెజాన్ 27 వేల మంది ఉద్యోగులను కంపెనీ నుంచి తీసేసింది. ప్రస్తుతం ఇంటి దగ్గర్నుంచి చేస్తున్న వాళ్లకు కూడా హైబ్రిడ్ మోడ్ లో మూడు రోజులు ఆఫీసుకు రావాలంటూ కంపెనీ ఉద్యోగులకు మెయిల్ చేసింది.