Apple CEO Tim Cook : యాపిల్ కంపెనీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. యాపిల్ కంపెనీ ఫోన్ ఐఫోన్ ప్రపంచవ్యాప్తంగా ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. ఐఫోన్ అంటే ఇష్టం లేని వారు ఎవ్వరూ ఉండరు. ఐఫోన్ అంటే ఒక పిచ్చి, ఒక క్రేజ్. ఆ క్రేజ్ ముందు మరే ఫోన్ పనికిరాదు.
అయితే.. ఐఫోన్ కొనాలంటే ఇప్పటి వరకు ఆన్ లైన్ లోనే మనం కొనేవాళ్లం. భారత్ లో ఒక్క ఐఫోన్ స్టోర్ కూడా లేదు. కానీ.. తాజాగా ముంబైలోని బీకేసీలో తొలి యాపిల్ స్టోర్ ను యాపిల్ కంపెనీ ఏర్పాటు చేసింది. దాన్ని ప్రారంభించడానికి యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ భారత్ వచ్చారు. ముంబైలోని బీకేసీలో ఉన్న జియో వరల్డ్ డ్రైవ్ మాల్ లో యాపిల్ స్టోర్ ను ప్రారంభించారు.
Apple CEO Tim Cook : ఈ ఈవెంట్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీల హాజరు
ఈ ఈవెంట్ కు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. రవీనా టాండన్, ఏఆర్ రహమాన్, మౌనీ రాయ్, మాధురీ దీక్షిత్, సూరజ్ నాంబియర్, అర్మాన్ మాలిక్, ఫారా ఖాన్ అలీ లాంటి సెలబ్రిటీల మధ్య యాపిల్ సీఈవో టిమ్ కుక్.. యాపిల్ స్టోర్ ను ముంబైలో ప్రారంభించారు.
ఆ తర్వాత ముంబై స్పెషల్ వడాపావ్ ను మాధురీ దీక్షిత్ తో కలిసి టిమ్ కుక్ తిన్నారు. ఈ సంవత్సరం ఐఫోన్ 15 ను యాపిల్ లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే. తొలి సారి ముంబైలో యాపిల్ స్టోర్ ను ఏర్పాటు చేయగా.. త్వరలోనే ఢిల్లీలో మరో స్టోర్ ను ఏర్పాటు చేయాలని యాపిల్ కంపెనీ భావిస్తోంది.