Apple iPhone 16 Features Leaked : ఇటీవలే యాపిల్ కంపెనీ ఐఫోన్ 15 ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో యాపిల్ సంస్థ కొన్ని ప్రొడక్ట్స్ ను రిలీజ్ చేస్తుంది. ఐఫోన్ లేటెస్ట్ మోడల్ ను విడుదల చేస్తుంటుంది. ఐఫోన్ 15 సిరీస్ లో భాగంగా పలు మోడల్స్ ను లాంచ్ చేసింది. ఇంకా ఐఫోన్ 15 మోడల్ ఫోన్లు మార్కెట్ లో నడుస్తూనే ఉన్నాయి. ఇంతలోనే ఐఫోన్ 16 గురించి, ఆ సిరీస్ గురించి, ఫీచర్ల గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు అందరి దృష్టి ఇక ఐఫోన్ 16 పై పడింది.
ఎందుకంటే.. ఇప్పటి వరకు ఐఫోన్ లో లేనటువంటి ఫీచర్లు, రానటువంటి ఫీచర్లు, ఐఫోన్ 15 లో కూడా లేని ఫీచర్లను యాపిల్ తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు అన్ని ఫోన్లలో రీఫ్రెష్ రేటు 60 ఉంది. కానీ.. రీఫ్రెష్ రేట్ 120 హెచ్‌జెడ్ ను ఐఫోన్ 16 లో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఏ17 ప్రో చిప్ సెట్, 8 జీబీ ర్యామ్ ఉండొచ్చని తెలుస్తోంది.
Apple iPhone 16 Features Leaked : స్క్రీన్ సైజ్ పెరుగుతుందా?
ప్రస్తుతం ఐఫోన్ 15 లో ఉన్న బేసిక్ మోడల్ ఫోన్ లో స్క్రీన్ డిస్ ప్లే 6.1 ఇంచులుగా ఉండేది. 15 ప్రో ప్లస్ ఫోన్ డిస్ ప్లే మాత్రం 6.7 గా ఉంది. కానీ.. ఐఫోన్ 16 ప్రో డిస్ ప్లే 6.3 ఇంచ్ అంటే లార్జ్ డిస్ ప్లే, అలాగే ఐఫోన్ 16 ప్రో మాక్స్ అయితే 6.9 ఇంచుల స్క్రీన్ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 6.9 ఇంచులు అంటే స్క్రీన్ సైజ్ ను ఈసారి భారీగానే పెంచుతున్నారు.
సాలిడ్ స్టేట్ బటన్, టెట్రా ప్రిజం కెమెరా ఫీచర్, నెక్స్ట్ జనరేషన్ చిప్ సెట్ డిజైన్ లాంటి ఫీచర్లతో ఐఫోన్ 16 రానున్నట్టు తెలుస్తోంది. అయితే.. ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్ లో ఉన్న ఫీచర్లను ఐఫోన్ 16 స్టాండర్డ్ మోడల్ ఫోన్లలోనే ఉపయోగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 15 లో లేని ఫీచర్లను ఇందులో యాడ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తోంది. వచ్చే సంవత్సరం జరగబోయే యాపిల్ ఈవెంట్ లో ఐఫోన్ 16 సిరీస్ ను యాపిల్ సంస్థ లాంచ్ చేయనుంది.