5G Smartphone : ప్రస్తుతం 5జీ యుగం నడుస్తోంది. దేశవ్యాప్తంగా పలు నగరాల్లో ఇప్పటికే 5జీ స్టార్ట్ అయింది. జియో, ఎయిర్ టెల్ లాంటి నెట్ వర్క్ సంస్థలు 5జీని ప్రారంభించాయి. త్వరలోనే వొడాఫోన్ కూడా దేశవ్యాప్తంగా 5జీ సర్వీసులను తీసుకొస్తా అని ప్రకటించింది. జియో, ఎయిర్ టెల్ నెట్ వర్క్స్ ను ఉపయోగించే వాళ్లు.. 5జీ సపోర్ట్ చేసే స్మార్ట్ ఫోన్ ఉండి ఉండే.. 5జీ సర్వీసులను ఉపయోగించుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర 5జీ సపోర్ట్ చేసే ఫోన్ లేకపోతే.. 5జీ సపోర్ట్ ఫోన్ కొనాలనుకుంటే కొన్ని విషయాలను ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి. ఆ విషయాలను తెలుసుకోకుండా తొందరపడి 5జీ ఫోన్ తీసుకుంటే మీరే బొక్కబోర్లా పడతారు. మీ డబ్బులు వేస్ట్ అవుతాయి.
5జీ సపోర్ట్ అనగానే అన్ని ఫోన్లు ఒకే విధంగా ఉండవు. 5జీ చిప్ సెట్స్ ఫోన్ల బ్రాండ్ ను బట్టి మారుతూ ఉంటాయి. కొన్ని ఫోన్లలో 5జీ చిప్ సెట్ ఉంటుంది. లేదంటే 5జీ మోనికర్ ఉంటుంది. అవి ఉంటే ఆ ఫోన్ లో 5జీ నెట్ వర్క్ ఎనేబుల్ అవుతుంది. అయితే.. ఆ ఫోన్ లో ఉండే 5జీ చిప్.. ఎంఎంవేవ్, సబ్ 6జీహెచ్ జెడ్ లాంటి ఫీచర్లను సపోర్ట్ చేస్తుందో లేదో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే.. 5జీ స్పీడ్ ను అందుకోవాలంటే.. 5జీ స్పీడ్ ను కరెక్ట్ గా క్యాచ్ చేయాలంటే.. కేవలం 5జీ చిప్ సెట్ ఉంటే సరిపోదు. దానికి తగ్గట్టుగా.. ఎంఎంవేవ్, సబ్ 5జీహెచ్ జెడ్ అనే ఫీచర్ కూడా ఉండాల్సిందే. ఈ ఫీచర్ ఉంటే 4జీ నెట్ వర్క్ కూడా బెటర్ గా వర్క్ అవుతుంది.
5G Smartphone : లిమిటెడ్ 5జీ సర్వీస్ ను అందించే ఫోన్లు తీసుకుంటే ఏమౌతుంది?
చాలామంది తక్కువ ధరలో వచ్చే 5జీ ఫోన్లవైపే మొగ్గు చూపుతుంటారు కానీ.. 5జీ ఫోన్ అనేగానే.. తక్కువ ధర అనగానే వెంటనే కొనేయకండి. ఎందుకంటే.. ఆ 5జీ ఫోన్ లో పైన చెప్పుకున్న ఫీచర్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఫుల్ 5జీ స్పీడ్, కవరేజ్ ఇచ్చే ఫోన్ అయితే బడ్జెట్ ధరలో తీసుకోవచ్చు. అలాగే.. 5జీ సపోర్ట్ ఫోన్ అంటే బ్యాటరీ బ్యాకప్ కూడా ఎక్కువగా ఉండాలి. కనీసం 6.5 ఇంచ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండాలి. 5జీ అనేది ప్రస్తుతం కొత్త టెక్నాలజీ. ఇటీవలి కాలంలో రిలీజ్ అయ్యే ప్రతి స్మార్ట్ ఫోన్ 5జీ సపోర్టే. కానీ.. అన్ని రకాలుగా 5జీ సేవలను అందించే ఫోన్ ను తీసుకుంటే బెటర్. లేదంటే 5జీ నెట్ వర్క్ చాలా కష్టాలు పడాల్సి వస్తుంది.