5G smartphones : 4జీ పోయింది.. 5జీ వచ్చేసింది. ఇది 5జీ యుగం. జియో, ఎయిర్ టెల్ లాంటి నెట్ వర్స్ 5జీకి షిఫ్ట్ అయిపోయాయి. దీంతో అందరూ ఇప్పుడు 5జీ ఫోన్లను వాడుతున్నారు. ఇప్పటి వరకు వాడిన 4జీ ఫోన్లు 5జీ నెట్ వర్క్ ను వాడటానికి పనికిరావు. దీంతో స్మార్ట్ ఫోన్ లవర్స్ 5జీ ఫోన్ కోసం చూస్తున్నారు. బడ్జెట్ ధరలో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్స్ ఏవి ఉన్నాయా అని వెతుకుతున్నారు. బడ్జెట్ ధరలో మీకు రూ.15 వేల లోపు దొరికే బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్లు ఏవో తెలుసుకుందాం రండి.
5G smartphones : iQOO Z6 Lite 5G
ఐక్యూ కంపెనీ నుంచి వచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది. ఐక్యూ జెడ్ 6 మోడల్ ఇది. 5జీ నెట్ వర్క్‌తో వచ్చే ఈ ఫోన్ లో అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. ధర కూడా చాలా తక్కువ. ఐక్యూ జెడ్6 లైట్ 5జీ పోన్.. స్నాప్ డ్రాగన్ 4 జెన్ 1 ఎస్‌వోసీ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్‌తో లాంచ్ అయిన తొలి ఫోన్ ఇదే. ఆండ్రాయిడ్ 12 ఫన్ టచ్ ఓఎస్, 120 హెచ్ జెడ్ డిస్ ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్ లోకి వచ్చింది.
Poco M4 5G
పోకో ఎం4 5జీ ఫోన్ కూడా బెస్ట్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో వచ్చిన ఫోన్. మీడియాటెక్ డైమెన్షనల్ 700 ఎస్‌వోసీ, 90 హెచ్‌జెడ్ వైబ్రంట్ డిస్‌ప్లే, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 50 ఎంపీ డుయల్ కెమెరా, 5జీ బాండ్ సపోర్ట్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ ధర కూడా రూ.15 వేల లోపే ఉంది.
Samsung Galaxy F23 5G
సామ్ సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి బడ్జెట్ ధరలో వచ్చిన 5జీ స్మార్ట్ ఫోన్లలో ఎఫ్23 ఒకటి. 120 హెచ్‌జెడ్ డిస్‌ప్లే, స్నాప్ డ్రాగన్ 750 ఎస్వోసీ, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి బెస్ట్ ఫీచర్స్ తో ఈ ఫోన్ లాంచ్ అయింది. దీని ధర కూడా రూ.15 వేల లోపే.
OPPO A74 5G
ఈ ఫోన్ ధర రూ.15,500 కానీ.. ఈ రేంజ్ లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అంటే ఇదే. ఒప్పో బ్రాండ్ గురించి తెలుసు కదా. బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్ కావాలంటే ఈ రేంజ్ లో అయితే వేరే ఫోన్ దొరకదు. 90 హెచ్‌జెడ్ డిస్ ప్లే, స్నాప్ డ్రాగన్ 480 ఎస్వోసీ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, 48 ఎంపీ ట్రిపుల్ రేర్ కెమెరా సిస్టమ్ లాంటి ఫీచర్లతో వచ్చిన ఈ ఫోన్ కూడా రూ.15 వేల రేంజ్ లో బెస్ట్ 5జీ స్మార్ట్ ఫోన్.